మంచు లక్ష్మి తొక్కేస్తోందన్న శ్రీరెడ్డి, ఆ నాలుగు కుటుంబాలకు, పవన్ కళ్యాణ్‌కు వార్నింగ్....

By Bojja Kumar

Recommended Video

Sri Reddy Comments On Manchu Lakshmi & Pawan Kalyan

సినీ పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి మహిళా సంఘాలతో కలిసి సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ పోరాటాన్ని పట్టించుకోని ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. ఇండస్ట్రీని ఏలుతున్న నాలుగు కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఈ సందర్భంగా ఆమె విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా ఆమె మంచు లక్ష్మి, పవన్ కళ్యాణ్‌ పేర్లను ప్రస్తావిస్తూ పలు సంచలన కామెంట్స్ చేశారు.

వ్యభిచారం బ్యాన్ చేశారు... ఇంకెలా బ్రతకాలి?

వ్యభిచారం బ్యాన్ చేశారు... ఇంకెలా బ్రతకాలి?

ప్రభుత్వానికి చెప్పేది ఒకటే... మా సమస్యలు మీ దృష్టికి వస్తున్నా పట్టించుకోవడం లేదు. మమ్మల్ని పట్టించుకోక పోతే మా పరిస్థితి ఏమిటి? వ్యభిచారాన్ని బ్యాన్ చేశారు. నేను ఈ సందర్భంగా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అడుగుతున్నాను... ఆర్టిస్టులమైన మేము ఎలా బ్రతకాలి? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఇక్కడ ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. మేము ఆర్టిస్టులం, ఆర్టిస్టులుగానే ఉంటాం. ఈ కళామతల్లికే మా జీవితం అంకితం. వ్యభిచారులు అంటూ కొందరిని అరెస్టు చేసి పట్టుకు పోతున్నారు, అవకాశాలు లేనపుడు వారు ఏం చేసి బ్రతకాలి.... అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

అక్కడే రిలీజ్ చేయండి

అక్కడే రిలీజ్ చేయండి

మాకు అవకాశాలు ఇస్తారా 70 శాతం అంటే.... పెట్టుబడి దారులు వారు, వారికి ఇష్టం వచ్చిన వారిని తీసుకుంటారు అని కొందరు అంటున్నారు. అలా అయితే ముంబై వారిని తీసుకుంటే మీ సినిమాలు ముంబైలోనే రిలీజ్ చేయండి, ఫారిన్ వారిని తీసుకుంటే ఫారిన్ లోనే రిలీజ్ చేయండి. తెలుగు ప్రాంతాల్లో మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు.... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

 మంచు లక్ష్మి లాంటి వారు తొక్కేస్తున్నారు

మంచు లక్ష్మి లాంటి వారు తొక్కేస్తున్నారు

సినిమాల్లో అవకాశాలు లేవు కనీసం మోడలింగ్ చేసుకుందామన్నా ఈ లక్ష్మి ప్రసన్న లాంటి వారు వాలిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్రతికనివ్వరు, మోడలింగులో బ్రతకనివ్వరు, టీవీ షోలు చేసుకుందామంటే లక్ష్మి ప్రసన్న లాంటి వారు అక్కడికి కూడా వచ్చేస్తే మేము ఎలా బ్రతకాలి? ప్రతి దాంట్లో మీరే ఎగబడి పోతుంటే మాలాంటి వారు ఏం చేసుకోవాలి?... అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

 ఆ నాలుగు కుటుంబాలు

ఆ నాలుగు కుటుంబాలు

అవార్డులు అవార్డులు అంటారు.... అవి కూడా కొనుక్కోవాల్సిన దరిద్రం. ఇవేమైనా బటానీలా? దీనికి కూడా రికమండేషన్స్. ప్రతి దాంట్లోనూ మీ ఇన్ ఫ్లూయోన్సేనా? మీరే యాక్టర్లు, మీకే అవార్డులు డిసైడ్ చేసే వారు అయితే ఎలా? బ్యాన్ చేయండి.... మీ నాలుగు కుటుంబాలు మాత్రమే సినిమాలు చేసుకుంటాం, ఎవరూ రావద్దు అని బోర్డు పెట్టండి. మేము టైమ్ వేస్ట్ చేసుకోకుండా మా పనులు మేము చేసుకుంటాం.... అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా నోరు విప్పండి, ఫ్యాన్స్‌కు బుద్ది చెప్పండి

పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా నోరు విప్పండి, ఫ్యాన్స్‌కు బుద్ది చెప్పండి

పోరాటాలతోనే పరిష్కారాలు దొరుకుతాయని నమ్ముతున్నాను. మేమే పోరాటం చేస్తుంటే కొందరు ఫ్యాన్స్ పలావ్ పొట్లాలు తిన్నారు, లం** మీటింగు అని చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాన్ గారు ఇలాంటి విషయాల్లో నోరు మూసుకుని ఉంటే మీరు ప్రజా నాయకుడు కాలేరు. సమస్యను పక్కదారి పట్టించే విధంగా మీ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. మీరు నోరు విప్పి వారిని కంట్రోల్ చేయండి. బహిరంగంగా చెప్పుకుంటారో? రహస్యంగా చెప్పుకుంటారో మాకు తెలియదు... మా మీద ఉసి గొల్పితే మొత్తం ఓట్లు గల్లంతయి మీరు ఎటు కాకుండా అయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాను.... అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.

 ఉగ్రవాదం కన్నా తీవ్రంగా ఉంది అది

ఉగ్రవాదం కన్నా తీవ్రంగా ఉంది అది

హైదరాబాద్‌లో ఉగ్రవాదం కన్నా తీవ్రంగా కోఆర్డినేటర్ సిస్టం తయారైంది. మీరు ఆడ పిల్లలను బయటకు పంపేపుడు చెప్పండి. కాలేజీల వద్దకు వచ్చి ఎవరైనా ఫోటోలు, ఫోన్ నెంబర్లు అడిగితే ఇవ్వకండి. సినిమాల్లో నటించాలని ఉంటే డైరెక్టుగా చాంబర్ రావొచ్చు.... అని శ్రీరెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X