twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఎంపీ అమ్మాయిల బ్రోకర్.. జగన్ వల్లే అలా జరిగింది: ఆ పని చేస్తే నాశనమేనంటూ రెచ్చిపోయిన శ్రీరెడ్డి

    |

    తెలుగు రాష్ట్రాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే వారిలో ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డి ఒకరు. హీరోయిన్‌గా పరిచయం అయిన ఈమె.. సినిమా రంగంలోని కాస్టింగ్ కౌచ్‌ ఉద్యమంతో ప్రకంపనలు రేపింది. అప్పుడే నగ్న నిరసన చేసి దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఇక, అప్పటి నుంచి ఎవరో ఒక సెలెబ్రిటీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇక, తాజాగా ఆమె పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన క్యారెక్టర్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

    ఆర్తి వెంకటేష్ బ్యూటీఫుల్ ఫోటోలు.. వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

    అలా ఎంట్రీ ఇచ్చిన శ్రీరెడ్డి.. వివాదాలతో

    అలా ఎంట్రీ ఇచ్చిన శ్రీరెడ్డి.. వివాదాలతో

    మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే 'నేను నాన్న అబద్ధం' అనే మూవీతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాలు చేసింది. కానీ, ఆమెకంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కాస్టింగ్ ఉద్యమంతో ఇండస్ట్రీకి దూరమైంది. అప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో ఉంటూ వస్తోందీ బ్యూటీ.

    ఇప్పుడు ఆ ఎంపీ మీద ఫోకస్ చేసింది

    ఇప్పుడు ఆ ఎంపీ మీద ఫోకస్ చేసింది

    శ్రీరెడ్డి చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నాయకులను కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని కానీ ఎవరైనా విమర్శిస్తే.. వాళ్లపై ఎదురుదాడి చేస్తోంది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా అదే కారణంతో నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజును శ్రీరెడ్డి బాగా టార్గెట్ చేస్తోంది.

    ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి

    ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి

    ఇటీవల ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఉద్దేశించి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. 'విగ్గురాజు.. ఏంట్రా రెచ్చిపోతున్నావు? నేను రంగంలోకి దిగానంటే తట్టుకోలేవు. నేను వస్తున్నా ఆగరా నీ పని చెబుతా' అంటూ బూతులతో రెచ్చిపోయింది. అందుకు అనుగుణంగానే అప్పటి నుంచి ఆయనను విమర్శిస్తూ పోస్టులు, వీడియోలు పెడుతోంది. దీంతో వీళ్లిద్దరి మధ్య వివాదం మొదలైంది.

    ఘాటుగా స్పందించిన ఎంపీ రఘురామ

    ఘాటుగా స్పందించిన ఎంపీ రఘురామ

    సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోన్న శ్రీరెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఎదురుదాడి చేశారు. ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియోను వదిలారు. అందులో 'ఓ కులానికి వత్తాసు పలుకుతూ నన్ను తిడుతోన్న బ్లూఫిల్మ్ నటి.. నువ్వు వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని నన్ను తిట్టడానికి వచ్చావు. వాళ్లకు నువ్వో శృంగార దేవతవు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఎంపీ అరెస్ట్.. పండుగ చేసుకున్న శ్రీరెడ్డి

    ఎంపీ అరెస్ట్.. పండుగ చేసుకున్న శ్రీరెడ్డి

    వైసీపీ నుంచి గెలిచి.. ఆ పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీరెడ్డి ఫుల్ ఖుషీ అవుతూ.. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తోంది. 'ఒక వికెట్ డౌన్ అయింది.. విగ్గురాజుకు తగిన శాస్తి జరిగింది' అంటూ సంచలన వ్యాఖ్యలతో కూడిన వీడియోలను షేర్ చేస్తోంది.

    రఘురామపై మరోసారి అనుచిత పోస్టు

    రఘురామపై మరోసారి అనుచిత పోస్టు

    ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై విమర్శలు చేస్తున్న శ్రీరెడ్డిని కొందరు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆమె.. 'నా వల్ల దేశానికి ఏ నష్టం జరగలేదు. ట్రోల్ చేస్తే అది మీ విచక్షణ. రఘురామ్ అనే ఈ ఎంపీ సంఘ విద్రోహక శక్తి, రాజ ద్రోహి, నమ్మక ద్రోహి, కుల ద్రోహి, దొంగ, అమ్మాయిల బ్రోకర్.. వాట్ నాట్.. వీడి మీద జాలి ఉన్న వారిని ఏమని పిలవాలో' అంటూ మరోసారి రెచ్చిపోయింది.

    జగన్ జోలికొస్తే నాశనమేనంటూ కామెంట్

    జగన్ జోలికొస్తే నాశనమేనంటూ కామెంట్


    ఇదే పోస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరును సైతం వాడేసింది శ్రీరెడ్డి. ఈ మేరకు 'జగనన్నని తప్పు పడితే, మీ నాశనం మీరు కోరుకుంటున్నట్టే.. జై హింద్' అంటూ రాసుకొచ్చింది. తద్వారా పరోక్షంగా జగన్ వ్యతిరేకులకు వార్నింగ్ ఇచ్చిందామె. ఇక, శ్రీరెడ్డి చేసిన ఈ పోస్టుకు వైసీపీ మద్దతుదారుల నుంచి లైకులు.. మిగిలిన వారి నుంచి తిట్లు వస్తున్నాయి.

    English summary
    Tollywood Actress Sri Reddy Sensational Comments on Mp Raghurama Krishnam Raju in Her Facebook Account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X