పవర్ ఆఫ్ శైలజారెడ్డి.. శ్రీరెడ్డి నుంచి ఊహించని కామెంట్స్.. కూల్ బాయ్ చైతు అంటూ!
Recommended Video

శ్రీరెడ్డి తెలుగు సినిమా గురించి ఎప్పుడు కామెంట్స్ చేసినా అవి నెగిటివ్ గానే ఉంటాయి. కానీ తాజగా శ్రీరెడ్డి శైలజారెడ్డి అల్లుడు చిత్రం గురించి చేసిన కామెంట్స్ చూస్తే ఆశ్చర్యపోవలసిందే. టాలీవుడ్ పై తీవ్రమైన వ్యాఖ్యలతో ఎప్పుడూ విరుచుకుపడే శ్రీరెడ్డి శైలజారెడ్డి చిత్రంపై ప్రశంసలు కురిపించింది. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపింది. తన పేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి తరచుగా తెలుగు సినీ ప్రముఖుల గురించి కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీరెడ్డి అనూహ్యంగా
శ్రీరెడ్డి తెలుగు సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడడం చాలా అరుదు. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రంపై శ్రీరెడ్డి ప్రశంసలు కురిపించింది. పవర్ అఫ్ శైలజారెడ్డి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది.

శైలజారెడ్డి అల్లుడికి సపోర్ట్
శైలజారెడ్డి అల్లుడికి నా సపోర్ట్ అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఇది సమంత టైం కాదు. నాగ చైతన్య టైమ్. అతడు బిగ్ హిట్ కొట్టే సమయం ఆసన్నమైంది అంటూ కామెంట్ చేసింది. నా అభిమాన నటి రమ్యకృష్ణకు శుభాకాంక్షలు.

కూల్ బాయ్
నాగ చైతన్య ని కూల్ బాయ్ అంటూ సంభోదించింది. కూల్ బాయ్ చైతుకి శుభాకాంక్షలు. అలాగే హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కి కూడా అంటూ శ్రీరెడ్డి శైలజారెడ్డి అల్లుడు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసింది.

దూసుకుపోతున్న అల్లుడు
ఇదిలా ఉండగా శైలజారెడ్డి చిత్రం కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంగా వినాయక చవితి హాలిడేని, వీకెండ్ ని ఉపయోగించుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











