ఆయన అందరి తోళ్లూ ఒలుస్తారు: నాని, శేఖర్ కమ్ముల, కోన వెంకట్‌పై శ్రీరెడ్డి సంచలనం!

By Bojja Kumar

కాస్టింగ్ కౌచ్, తెలుగు సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌లోని సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు చెబుతున్న శ్రీరెడ్డి ఇకపై న్యాయపరమైన పోరాటానికి సిద్ధమైంది. బుధవారం ఆమె తన లాయర్లతో కలిసి హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆమె కోన వెంకట్, నాని, శేఖర్ కమ్ముల పేర్లను ప్రస్తావించింది. ఇక నుండి ఇండస్ట్రీలో ఏ అమ్మాయి వంక చూడాలన్నా, ఎస్ఎంఎస్ చేయాలన్నా, వాట్సాప్ చేయాలన్నా భయపడాలి. అలా చేసిన వారందరినీ ఇరికిస్తాను... అని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.

Recommended Video

Sri Reddy sensational Comments On Pawan Kalyan Again
 కోన వెంకట్‌కు శ్రీరెడ్డి సవాల్

కోన వెంకట్‌కు శ్రీరెడ్డి సవాల్

‘‘కోన వెంకట్ అనే వ్యక్తి ఆ రోజు మహాటీవీ లైవ్‌లో వంశీ చౌదరి పేరుతో ఫోన్ చేయించారు. కోన వెంకట్‌కు ఒకటే చెబుతున్నాను. నువ్వు ఏం చేశావో నాకు తెలుసు, చూసుకుందాం. కోర్టు కేసు వేస్తానని అన్నావు కదా... రా చూసుకుందాం'' అని శ్రీరెడ్డి అన్నారు.

నాని, శేఖర్ కమ్ముల ప్రస్తావన

నాని, శేఖర్ కమ్ముల ప్రస్తావన

నాని, శేఖర్ కమ్ముల వీళ్ల పేర్లు కూడా తీసుకున్నాను. వాళ్లతో ఏం జరిగిందో నాకు తెలుసు. అందరి వివరాలు సేకరిస్తున్నాం..... అని శ్రీరెడ్డి తెలిపారు.

తొందర్లో ఆయన వచ్చి అందరి తోళ్లూ ఒలుస్తారు

తొందర్లో ఆయన వచ్చి అందరి తోళ్లూ ఒలుస్తారు

తొందర్లో మన పట్టాభిగారు వచ్చి అందరి తోళ్లు ఒలుస్తారు. ప్రెస్ ముందుకొచ్చి నాటకాలు ఆడుతూ అంతా ఉత్తిదే అంటే అయిపోతుందా? నేను భయపడుతాననుకుంటున్నారా? ఇపుడు నాలాగే ఒక్కొక్కరూ బయటకు వస్తారు. ఎంత తొక్కుదామని ప్రయత్నిస్తే అంత కెరటం లాగా ఎగసి పడతారు.... అని శ్రీరెడ్డి అన్నారు.

మాకు వచ్చిన కోపానికి మీరు అనుభవించాల్సిందే

మాకు వచ్చిన కోపానికి మీరు అనుభవించాల్సిందే

‘లా‘ను వాడుకోమని చెప్పారు కాబట్టి... లా, పోలీసులు, మాలోని కోపాన్ని కూడా వాడుకుంటాం. ఆ కోపం పోరాట రూపం ఎలా దాలుస్తుందో చూపిస్తాం. సక్సెస్, డిఫీట్ అనేది తర్వాత సంగతి. మాకు వచ్చిన కోపానికి మీరు అనుభవించల్సిందే.... అని శ్రీరెడ్డి అన్నారు.

వారందరినీ ఇరికిస్తాను

వారందరినీ ఇరికిస్తాను

ఇక నుండి ఏ అమ్మాయి వంక చూడాలన్నా, ఎస్ఎంఎస్ చేయాలన్నా, వాట్సాప్ చేయాలన్నా భయపడాలి. అలా చేసిన వారందరినీ ఇరికిస్తాను. అపుడు మిమ్మల్ని ఎవరు కాపాడుతారో చూస్తాం... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను సొంత ఇల్లు లాగా వాడుకుని..

పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను సొంత ఇల్లు లాగా వాడుకుని..

శ్రీరెడ్డి తరుపున లాయర్ మాట్లాడుతూ... సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్స్ కింద రిజిస్టర్ అయిన ఒక సంస్థ ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'. ఇందులో 900 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ వారిలో ఒక ప్యానల్ ఎన్నుకుని ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ ఇలా అందరినీ ఎన్నుకుంటారు. పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను సొంత ఇల్లు లాగా వాడుకుని అందులో ఉన్న 900 మంది మెంబర్స్ కాన్ఫిడెన్స్ తీసుకున్నట్లుగా ఎవరికీ ఎలాంటి సభ్యంతరాలు లేనట్లుగా మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. మరి అలాంటి కామెంట్స్ చేసినపుడు అసోసియేషన్లో ఉన్న ఒక్కరు కూడా నోరు మొదపలేదు. అంటే దాని అర్థం 900 మందిలో ఈ ఆరుగురు పోతే 894 మంది డమ్మీలు... అన్నారు.

కంప్లీట్ ఈ అసోసియేషన్ ఆరుగురి చేతుల్లో ఉంది

కంప్లీట్ ఈ అసోసియేషన్ ఆరుగురి చేతుల్లో ఉంది

కంప్లీట్ ఈ ‘మా' అసోసియేషన్ ఆరుగురి చేతుల్లో ఉంది. దానికి ఒక ప్రెసిడెంట్ శివాజీ రాజాను పెట్టి ... దాంట్లో చిరంజీవి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్, నాగబాబు, కృష్టం రాజు, ఎవరైతే ఇద్దరు ముగ్గురు టాప్ మోస్ట్ గ్రేడ్ 1 హీరోలు ఉన్నారో వారికి చెందినదే ఈ ‘మా', మిగతా జూనియర్ ఆర్టిస్టులకు సంబంధం లేదు అనే ప్రవర్తన ఏదైతే ఉందో అది తప్పు... అని శ్రీరెడ్డి తరుపు లాయర్ అన్నారు.

ప్రతి ఒక్కరూ శ్రీరెడ్డి ఫైల్ చేసే డ్యామేజ్ సూట్ కు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది

ప్రతి ఒక్కరూ శ్రీరెడ్డి ఫైల్ చేసే డ్యామేజ్ సూట్ కు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది

మీ అసోసియేషన్ నిబంధనలు ఏమిటి? సొసైటీ రిజిస్ట్రేషన్స్ యాక్ట్ ప్రాకారం ప్రకారం మీటింగ్ పెట్టడానికి మూడు రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. రేపు ఆర్టీఏ ద్వారా అన్ని బయటకు తీపిస్తాం. సుప్రీం కోర్టు నుండి పిటీషన్ వేసి కంప్లీట్ డాక్యుమెంట్స్ సుప్రీం కోర్టులో సబ్ మిట్ చేయమని అడుగుతాం. అపుడు అన్ని తెలుస్తాయి. ఎవరు మీటింగ్ పెట్టారు. ఎజెండా ఏమిటి? నిర్ణయాలు తీసుకున్నది ఇవన్నీ రేపు కోర్టుకు వస్తే ఎవరూ కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ప్రతి ఒక్కరూ శ్రీరెడ్డి ఫైల్ చేసే డ్యామేజ్ సూట్ కు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది.... అని శ్రీరెడ్డి తరుపు లాయర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X