Sri Reddy: పవన్ కల్యాణ్ కు చెప్పు చూపిస్తూ శ్రీరెడ్డి బూతులు.. నాకు సిగ్గు లేదంటూ ఘోరంగా

వైజాగ్ లో జరిగిన సంఘటనలపై మంగళవారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డాడు. వైసీపీ నేతలను కొడకల్లారా.. సన్నాసుల్లారా.. అంటూ తన ఉగ్రరూపం ప్రదర్శించాడు. తనపై చేస్తున్న ప్యాకేజీ స్టార్, మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే విమర్శలపై స్పందిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పవన్ కల్యాణ్. అంతేకాకుండా చెప్పు చూపించి మరి దవడ వాచిపోయేలా కొడతా.. దద్దమ్మల్లారా అంటూ ఎప్పుడు చూపించిన కోపాన్ని చూపించాడు పవర్ స్టార్. అయితే ఈ వాఖ్యలపై తాజాగా వివాదస్పద నటి శ్రీరెడ్డి రియాక్ట్ అయింది. ఆమె కూడా చెప్పు చూపిస్తూ పవన్ కల్యాణ్ ను కాపాడేది ఒక్క జగన్ అన్నే అని చెప్పుకొచ్చింది.

వైజాగ్ లో జరిగిన సంఘటనలపై..

వైజాగ్ లో జరిగిన సంఘటనలపై..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే జనసేన అధినేతగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాడు. ఇటీవల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్ ప్రీ వర్క్ లో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఏపీ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మీటింగ్ కు హాజరయ్యాడు. ఈ పార్టీ భేటీలో వైజాగ్ లో జరిగిన సంఘటనలపై విరుచుకుపడ్డారు.

 వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్..

వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్..

అలాగే తనను ప్యాకేజీ స్టార్, మూడు పెళ్లిల్లు చేసుకున్నాడని చేసిన విమర్శలపై చాలా ఘాటుగా స్పందించారు. చెప్పు చూపిస్తూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సన్నాసుల్లారా.. దద్దమ్మాల్లారా.. మీరు గూండాలా.. క్రిమినల్సా.. ఒంటి చేత్తో మెడ వంచి తోలు వలుస్తా అంటూ ఉగ్రరూపం చూపించాడు పవన్ కల్యాణ్. అనంతరం పవన్ కల్యాణ్, చంద్ర బాబు భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ లో వైసీపీపై నిప్పులు చెరిగారు.

చెప్పు చూపించి..

చెప్పు చూపించి..

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై మండిపడింది కాంట్రవర్సీ నటి శ్రీరెడ్డి. ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి.. పవన్ కల్యాణ్ ను పచ్చి బూతులు తిట్టింది. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ కు శ్రీరెడ్డి చెప్పు చూపించి తిట్ల దండకం అందుకుంది. ఇది బాటా వాళ్ల చెప్పు.. చాలా స్ట్రాంగ్.. కొట్టానంటే మాములుగా ఉండదు.. పవన్ కల్యాణ్ పిచ్చి తనానికి, పవన్ కల్యాణ్ ఎర్రితనానికి.. నీ రౌడీయిజానికి నా చెప్పులతో నమస్కారం.

తిట్టండి.. నాకేం సిగ్గులేదు..

తిట్టండి.. నాకేం సిగ్గులేదు..

నన్నుతిడతారో తిట్టండి.. నాకేం సిగ్గులేదు.. సిగ్గులేని దానికి తెడ్డే లింగం.. బయపడేది లేదు.. ఇది ప్రజా స్వామ్యమా.. ఇంకేమైనానా.. మంత్రుల్ని కొట్టి.. చెప్పులు చూపించి రౌడీయిజం చూపిస్తారు. మీకు అసలు రౌడీయిజం అంటే ఎలా ఉంటుందో చూపించాల్సిందే. రాడ్ లతో వస్తారా.. రాళ్లతో వస్తారా.. అని అంటావా.. వాడు నువ్ కలిసి నాటకాలు ఆడతారా.. అసలు వీడికి వైజాగ్ లో ఏం పని.

ఓ జెండా లేదు.. ఓ అజెండా లేదు..

నీకంటూ ఓ జెండా లేదు.. ఓ అజెండా లేదు.. ఆ బొల్లిగాడు ఏది చెప్తే అది చేయడం.. వాడు ప్యాకేజికి కక్కుర్తి పడటం. నేను ఒక్కటి చెబుతున్నా.. పవన్ కల్యాణ్ ని ప్రాణాలతో కాపాడటం ఒక్క జగన్ అన్నకే సాధ్యం అవుతుంది. వంగవీటిని టీడీపీ వాళ్లు ఎలాగైతే చంపేశారో నిన్ను కూడా అలాగే లేపేస్తారు. జగనన్నే కాపాడాలి అంటూ బూతూలతో పవన్ కల్యాణ్ ను తిట్టిపోసింది శ్రీరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X