పూనమ్ కౌర్‌పై శ్రీరెడ్డి కౌంటర్.. గోడ మీద పిల్లి అంటూ కామెంట్
పూనమ్ కౌర్, శ్రీరెడ్డి పేర్లు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేర్లు. వీరిద్దరు సినిమాల్లో నటించి ఫేమస్ అవడం కంటే వారు సోషల్ మీడియాలో చేసే కామెంట్లు, పోస్ట్‌లతో ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. మీటూ ఉద్యమ సమయంలో అర్థ నగ్న నిరసన చేసి సెన్సేషన్ క్రియేట్ చేయగా.. కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ వ్యవహారంలో వచ్చిన పూనమ్ కౌర్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. సమయం, సందర్భం లేకుండా చేసే కామెంట్లతో వార్తల్లోకెక్కే వీరు.. తాజాగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. పూనమ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారం లేపగా.. శ్రీ రెడ్డి వేసిన కౌంటర్ మళ్లీ చిచ్చును రేపేట్టు కనిపిస్తోంది. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం..

దుమారం లేపిన పూనమ్ కౌర్ ట్వీట్..
అబద్దమాడేవాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ, నాయకుడు ఎప్పటికీ కాలేడని పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది. అది పవన్ కళ్యాణ్‌నుద్దేశించే ట్వీట్ చేసిందని ఓ వర్గం మీడియా హైలెట్ చేసింది. నెటిజన్లు కూడా పవన్ కళ్యాణ్ గురించే అయి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ వీరాభిమానులు మాత్రం పూనమ్‌పై మండి పడుతున్నారు.
వివరణ ఇచ్చిన పూనమ్...
దీంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేసింది. తన ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయని, ఎదుటివారి ఆలోచనలన్నీ ఊహాగానాలే అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిపెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయని, నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని అని తెలిపింది. అయితే పూనమ్ ఇందులోనూ స్పష్టంగా పేర్కొనలేదు.

ఈ మ్యాటర్‌లో శ్రీరెడ్డి ఎంటర్..
ఇక ఓ వైపు పూనమ్ ట్వీట్ దుమారం రేపుతుండగా.. మధ్యలో శ్రీ రెడ్డి ఎంటర్ అయింది. ఈ దొంగ చాటు ట్వీట్లు వద్దని కౌంటర్ ఇస్తున్నట్లుగా.. గోడ మీద పిల్లిలా ట్వీట్లు పెట్టకు.. ధైర్యముంటే డైరెక్ట్‌గా మాట్లాడు అంటూ పోస్ట్ చేసింది. మరి చివరకు ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











