సురేష్ బాబును చూస్తే అసహ్యం.. వెంకటేష్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

శ్రీరెడ్డికి దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. సురేష్ బాబు తనయుడు, రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ తనను మోసం చేశాడని, ఇద్దరూ ప్రైవేట్‌గా దిగిన ఫోటోలను మీడియా ముందు పెట్టింది శ్రీరెడ్డి. శ్రీ రెడ్డి అభిరామ్ ఇష్యూ అప్పట్లో టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.అయితే సమయం దొరికినప్పుడల్లా దగ్గుబాటి ఫ్యామిలీపై, అభిరామ్‌పై సెటైర్లు వేస్తూనే ఉంటుంది.

తాజాగా కారు ప్రమాదంపై..

తాజాగా కారు ప్రమాదంపై..

దగ్గుబాటి అభిరాం కారుకు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే శ్రీ రెడ్డి ఓ వీడియో పెట్టింది. గతంలో తనను ఎంత అవమానించాడో చెప్పుకొస్తూ.. దేవుడు ఉన్నాడ్రా దేవుడు ఉన్నాడు అందుకే ఇలా జరిగిందంటూ అభిరాంపై శాపనార్దాలు పెట్టింది. తాజాగా రానా పెళ్లిపై ఓ వీడియోను వదిలింది. ఇందులో అనేక విషయాలపై స్పందించింది.

ప్రేమించి, పెళ్లి..

ప్రేమించి, పెళ్లి..

‘రానా బావ కంగ్రాట్స్.. నువ్ మంచి అమ్మాయిని ప్రేమించావ్.. పెళ్లి చేసుకున్నావ్.. కంగ్రాట్స్.. మరి నా పెళ్లి ఎప్పుడు మీ తమ్ముడితో.. సరదాకి అడుగుతున్నాలే బావ.. బావల్ని ఆటపట్టిస్తుంటారు కదా' అంటూ దగ్గుబాటి ఫ్యామిలీ గురించి వివరించుకొచ్చింది. వెంకటేష్, సురేష్ బాబు, అభిరాం, రానాల గురించి తెలిపింది.

నచ్చిన వ్యక్తి ఆయనే..

నచ్చిన వ్యక్తి ఆయనే..

‘మీ ఫ్యామిలీలో నాకు, నా కుటుంబానికి బాగా నచ్చేవాళ్లు ఎవరు అంటే.. హీరో వెంకటేష్ గారు. ఎవ్వరి జోలికి వెళ్లరు.. ఏ హీరోయిన్‌తోనూ ఎఫైర్ కూడా వినిపించలేదు. ఎప్పుడూ దైవభక్తి కలిగినవారు.. ఫ్యామిలీ కూడా పబ్లిక్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా సింపుల్ బతుకుతారు. అది నాకు చాలా ఇష్టం.

అది బాధపెట్టింది..

అది బాధపెట్టింది..

కాని వెంకటేష్ గారి విషయంలో నాకు చిన్న బాధ అనిపించింది. నేను ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు అది నిజమా కదా ఏంటి.. అని కనుక్కోలేదు. వాళ్ల వైపు నుంచి ప్రయత్నం చేయలేదు. అది నాకు కొంచెం బాధ పెట్టింది. అంత పెద్ద వ్యక్తి సీనియర్ హీరో.. మూవీ ఇండస్ట్రీలో బాధలు, కష్టాలు తెలిసిన వ్యక్తి వెంకటేష్ ఆయన మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకంటే తప్పు మనవైపు జరిగినా అవతల వైపు జరిగినా ఓ పెద్ద మనిషిలా మాట్లాడితే బాగుండేది.

Recommended Video

#Watch : Hero Vishal Explains How He Was Cured From Corona
సురేష్ బాబు అంటే అసహ్యం..

సురేష్ బాబు అంటే అసహ్యం..


నాకు చాలా అసహ్యంగా అనిపించేది సురేష్ బాబు క్యారెక్టర్. ఈ సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా ఇలాంటి సమస్య ఉంది.. అది సర్వసాధారణమని కొడుకుని వెనకేసుకుని మాట్లాడినప్పటి నుంచి నాకు అసహ్యం పెరిగిపోయింది. సొంత కొడుకుని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడిన మీరు.. నా జన్మలో క్షమించను.. మీరు చచ్చిపోయినా క్షమించను' అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X