రానా బావా.. మీ తమ్ముడితో నా పెళ్లి ఎప్పుడు చేస్తావ్.. మళ్లీ గెలికిన శ్రీ రెడ్డి

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ ప్రకంపనలు సృష్టించింది శ్రీ రెడ్డి. సినీ అవకాశాల పేరిట అన్యాయానికి గురైన అమ్మాయిలకు మద్దతుగా చేపట్టిన మీటూ ఉద్యమంలో శ్రీ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించింది. అయితే మధ్యలో దగ్గుబాటి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్‌పై అనవసరమైన కామెంట్లు చేసింది. ఇక అప్పటి నుంచి శ్రీ రెడ్డికి మీడియాలో ప్రాధాన్యం తగ్గింది. చివరకు చెన్నైకి వెళ్లి సెటైలింది. అయితే మధ్య మధ్యలో అభిరామ్, రానా, నాని, పవన్ కళ్యాణ్ వంటి వారిపై సెటైర్లు వేస్తూనే ఉంటుంది.

Recommended Video

Sri Reddy Comments On Daggubati Abhiram ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్‌వి అన్నావే? || Oneindia Telugu
ఐటీ రైడ్స్ సమయంలో..

ఐటీ రైడ్స్ సమయంలో..

టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్ జరిగిన సమయంలో శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ సెన్సేషనల్‌గా మారాయి. నాని, వెంకటేష్, నాగార్జున కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై శ్రీ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేసింది. చేసిన పాపం ఊరికే పోదని నానా కామెంట్స్ చేసింది.

ఇక రీసెంట్‌గా కారు ప్రమాదంపై..

ఇక రీసెంట్‌గా కారు ప్రమాదంపై..

తాజాగా దగ్గుబాటి అభిరాం కారుకు ప్రమాదం జరిగిందనే రూమర్స్ దావానంలా వ్యాప్తి చెందాయి. అయితే ఈ ఘటనపై నిజం తెలుసుకోకుండానే శ్రీ రెడ్డి స్పందించింది. నిజంగా అభిరాం కారుకే ప్రమాదం జరిగిందని భావించి.. తగిన శాస్తి జరిగిందన్నట్టుగా దేవుడు ఉన్నాడ్రా అని ఓ వీడియోను రిలీజ్ చేసింది. తాజాగా రానా పెళ్లిపై కామెంట్ చేస్తూ మరో వీడియోను వదిలింది.

రానా బావా..

రానా బావా..

‘మా రానా బావ పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. మెహీకా డ్రెస్‌ బాగుంది. ఆల్ ది బెస్ట్ మిహీకా. రానా బావా కంగ్రాట్యులేషన్స్. నేను మీ ఫ్యామిలీతో రిలేషన్ ఫీల్ అవుతుంటా.. ఎన్నో కారణాలున్నాయ్ దానికి. అలాగే బాహుబలిలో మీరు చేసిన యాక్టింగ్‌కు ఫిదా అయిపోయాను..

మిమ్మల్ని ఆరాధిస్తాను..

మిమ్మల్ని ఆరాధిస్తాను..

ఆ క్యారెక్టర్ మీరు తప్ప ఎవరూ చేసినా కూడా నాకు తెలిసి బాహబలికి న్యాయం జరగదు. మిమ్మల్ని నేను అంతగా ఆరాధిస్తాను.. అలాగే మీకు ఆనారోగ్యంగా ఉందని తెలిసినప్పుడు కూడా చాలా బాధపడ్డా. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అభిమానించి ఉండొచ్చు లేదంటే మీ బ్రదర్‌తో నాకు ఉన్న రిలేషన్ కావచ్చు.. రకరకాల కారణాలున్నాయి.

మా పెళ్లి ఎప్పుడు

మా పెళ్లి ఎప్పుడు

ఎంతైనా మీరు మా బావగారు. బావా మీరు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నాకైతే ఎక్కడా యారగెంట్‌గా అనిపించలేదు.. చాలా సాఫ్ట్ స్మూత్‌గా అనిపించింది.. మీ పెళ్లైతే బాగానే చేసేసుకున్నారు.. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు.. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. మరి మా పెళ్లి ఎప్పుడు చేస్తారు.. అభితో.. చుమ్మా అడుగుతున్నా.. సరదాగా అడుగుతున్నా. బావల్ని మరదలు ఆటపట్టిస్తారు కదా.. అందుకే అడుగుతున్నా అంటూ శ్రీ రెడ్డి సరసమాడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X