Don't Miss!
- News జగన్‌కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రోజాపై శ్రీ రెడ్డి అటాక్.. ఇంతకీ ఆమె టార్గెట్ ఏంటి? సెన్సేషన్ అవుతున్న తాజా ఇష్యూ
టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లొంగదీసుకుని మోసం చేస్తున్నారంటూ నానా రచ్చ చేసిన ఆమె.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. తనకేదనిపిస్తే అది కామెంట్ రూపంలో తెలియజేస్తూ జనం నోళ్ళలో నానుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినీ నటి రోజాపై ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆధారం సంగతి అటుంచితే.. ఎవ్వరినీ వదలని శ్రీ రెడ్డి
హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చేసిన శ్రీ రెడ్డి టెక్నాలజీని బాగా వాదిస్తోంది. ఆధునిక పోకడను క్యాచ్ చేసుకుంటూ అంతకంతకూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఫేస్బుక్ వేదికగా అందరినీ టార్గెట్ చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తోంది. ఎలాంటి సరైన ఆధారాలు చూపకుండానే పలువురు సినీ ప్రముఖులపై కామెంట్స్ గుప్పిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
స్టార్ హీరోయిన్లను సైతం వదలకుండా..
ఫేస్బుక్ వేదికగా శ్రీరెడ్డి పోస్ట్ చేస్తున్న కామెంట్లు హద్దులు దాటుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఫేమస్ హీరోయిన్స్ పేర్లు వాడేస్తూ బాహాటంగా కామెంట్స్ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. గతంలో తేజతో తాజ్ బంజారా రూములో ఇలియానా అని, విశాల్ కారవాన్ లో జరిగే బాగోతం అదే అని, మా ఆయన దగ్గుబాటి అభిరామ్ ఒక్కడినే సమంత పిలిచిందని రకరకాల కామెంట్లతో సంచలనాలు సృష్టించింది శ్రీరెడ్డి.
చివరకు రోజాను కూడా లాగేస్తూ
ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం పలు టీవీ షోస్ చేస్తూ రాజకీయాల్లో కూడా బిజీగా ఉంది రోజా. గత ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగరేసి సూపర్ ఫామ్‌లో ఉంది. అలాంటి రోజాను టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి పెడుతున్న కొన్ని కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
బతుకు జట్కా బండికి వస్తా అంటూ
మీరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు నా పూర్తి మద్దతు మీకే అని తెలిపిన శ్రీ రెడ్డి.. మీకు నిజం చెప్పాలనేదే నా ప్రయత్నం అంటూ బాంబు లాంటి కామెంట్ వదిలింది. ఆ వెంటనే మరో పోస్ట్ చేస్తూ.. మీరు చేసే రచ్చ బండ లేదా బతుకు జట్కా బండి ప్రోగ్రామ్‌కి వాళ్లను పిలవండి. నేనూ కూడా వస్తా అంటూ తనదైన కోణంలో బాణం విసిరింది శ్రీరెడ్డి. దీంతో ఈ ఇష్యూ నెట్టింట సెన్సేషన్ అవుతోంది.
రోజాపై ఇలా.. కొత్తేమీ కాదు
రోజాపై శ్రీరెడ్డి కామెంట్స్ చేయడం కొత్తేమీకాదు. రోజా గురించి గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేసిన దుమారం రేపింది సంచలన తార శ్రీ రెడ్డి. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మళ్ళీ ఇప్పుడు ఇలా కామెంట్స్ పెడుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇంతకీ శ్రీ రెడ్డి టార్గెట్ ఏంటో!
కాస్టింగ్ కౌచ్ పోరాటాన్ని మధ్యలోనే ఆపిన శ్రీ రెడ్డి.. టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ కూడా వదలకుండా ఇలా కామెంట్స్ చేస్తూనే వస్తోంది. అదును చూసి శ్రీరెడ్డి చేస్తున్న అటాక్స్ షాకిస్తున్నాయి. అయితే ఇంతకీ శ్రీ రెడ్డి ఎందుకిలా కామెంట్లు చేస్తోంది? ప్రూఫ్ లేకుండా అందరి పేర్లు ఇలా ఎందుకు లాగుతోంది? ఇంతకీ శ్రీ రెడ్డి టార్గెట్ ఏంటి? అనేది మాత్రం ఏ ఒక్కరికీ అర్థం కావడం లేదు.