సోనూసూద్‌పై మనసు పారేసుకున్న శ్రీ రెడ్డి!.. హాట్, లవ్యూ అంటూ పోస్ట్
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ ఎంత ఫేమస్సో.. మన దేశంలో సోనూ సూద్ అంత ఫేమస్. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని సోనూ సూద్ ఎంతో కొంతో తీర్చుతున్నాడు. ఎంతో మంది పేదల ఆకలి తీర్చాడు. ఇంకెంతో మంది వలస కార్మికులను సొంతింటికి చేర్చాడు. సాయం అంటూ ఎక్కడి వారు పిలిచినా సరే క్షణాల్లో స్పందించి సాయం చేస్తున్నాడు. అలాంటి సోనూ సూద్‌పై శ్రీ రెడ్డి మనసు పారేసుకుంది.

కరోనా కష్టకాలంలో..
కరోనా కష్టకాలంలో సోనూ సూద్ చేసిన సాయం దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. పేదలకు ఆకలి తీర్చడం, వలస కార్మికులను స్వగ్రామాలకు తిరిగి పంపడం, నర్సుల కోసం స్పెషల్ ఫ్లైట్స్ వేయించి మరి ఇంటికి చేర్చడం, డాక్టర్లు, పోలీసుల బస కోసం తన హోటల్‌ను ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే సోనూ సూద్ చేసిన మంచి పనులెన్నో ఉన్నాయి.

ఉపాధి కల్పన సైతం..
కరోనా సంక్షోభంలో ఉపాధి కోల్పోయిన వారికి పని కల్పించేందుకు సోనూ సూద్ సంకల్పించుకున్నాడు. దాదాపు రెండు మిలియన్ల ఉద్యోగాలను కల్పించేందుకు ఓ ప్రత్యేకమైన యాప్‌ను క్రియేట్ చేశాడు. వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు సోనూ సూద్ సిద్దమయ్యాడు. ఈ మధ్య అనంతపురం రైతుకు ట్రాక్టర్ బహుమతించడంతో దేశ వ్యాప్తంగా సోనూ సూద్‌పై ప్రశంసల ఝల్లు కురిసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
టాలీవుడ్, కోలీవుడ్‌లో మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ సంచలనానికి తెరలేపిన శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. సినీ, రాజకీయ అంశాలపైనే కాకుండా సమాజానికి సంబంధించినప్రతీ అంశంపైనా శ్రీ రెడ్డి కామెంట్స్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న శ్రీ రెడ్డి తాజాగా సోనూ సూద్‌పై స్పందించింది.
Recommended Video

హాట్, ఐ లవ్యూ..
సోనూ సూద్ చేస్తున్న మంచి పనులకు శ్రీ రెడ్డి ఫిదా అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి సోనూ సూద్‌ను ఓ రేంజ్‌లో పొగిడేసింది. సోనూ సూద్ కేవలం హాట్ మాత్రమే కాదు మంచి హార్ట్ ఉన్నవాడు కూడా అని చెప్పుకొచ్చింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.. మీకు మంచి జరగాలి సోనూ సూద్ గారు అని చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











