త్వరలోనే వారి చావులు కూడా చూస్తాను.. సుశాంత్ సింగ్ మృతిపై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి.. కేవలం సినీ పరిశ్రమనే కాదు యావత్ భారతావనిని కుదిపేసింది. డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ ఆదివారం బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై సినీ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అయితే సుశాంత్ ఆత్మహత్య పాపం మాత్రం బాలీవుడ్‌దేనని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కరణ్ జోహర్, అలియా భట్‌లను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అదే సమయంలో కంగనా రనౌత్‌ను పొగుడుతున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Sri Reddy Comments Viral
నెటిజన్స్ ఫైర్..

నెటిజన్స్ ఫైర్..

సుశాంత్ మరణానికి బాలీవుడ్‌లో పాతుకుపోయిన బంధుప్రీతే కారణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జోహర్ మాఫియా వల్లే ఇంత ఘోరం జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో సుశాంత్‌ను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ అలియా, కరణ్ జోహర్‌ను నెటిజన్లు దూషిస్తున్నారు.

నెపోటిజమ్‌కు వ్యతిరేకంగా..

నెపోటిజమ్‌కు వ్యతిరేకంగా..

బాలీవుడ్‌లో నెపోటిజమ్ ఉందని, దానికి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తోంది కంగనా రనౌత్. నిత్యం కరణ్ జోహర్, ఆయన మాఫియా గురించి, వారసత్వం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. గతంలో ఆమె మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ఒక్కొక్కరు ఒక్కోలా..

ఒక్కొక్కరు ఒక్కోలా..

సుశాంత్ ఆత్మహత్యపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. గత కొంతకాలం నుంచి సుశాంత్ సినిమాలు ఆడటం లేదని, ఎవ్వరూ కూడా అవకాశాలు ఇవ్వకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడని అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మరణానికి కారణమైన వారే ఇప్పుడు సోషల్ మీడియాలో మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడుతున్నారు.

శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

ఏ విషయంలోనైనా తనదైన శైలిలో స్పందించే శ్రీ రెడ్డి.. సుశాంత్ మరణంపైనా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘నీ మరణానికి కారకులను నేను అభినందిస్తున్నాను.. వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో... కానీ మిస్టర్ సుశాంత్ సింగ్ ఇండియా నిన్ను మిస్ అవుతుంది..ఆత్మకు శాంతి చేకూరాల'ని పోస్ట్ చేసింది. ఇక శ్రీ రెడ్డి పోస్ట్‌తో నెటిజన్లు ఏకిభవిస్తూ.. చాలా బాగా చెప్పావని అభినందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X