ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంత ధైర్యం.. కన్నీళ్లు ఆపుకోలేక పోతున్నాను..శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

ప్రస్తుతం చిత్ర సీమను సెలెబ్రిటీల చావులు వెంటాడుతున్నాయి. అది ఆత్మహత్యలే కావచ్చు లేదా సాధారణమైన మృత్యువైనా కావచ్చు. ఈ ఏడాది భారత చలన చిత్ర పరిశ్రమలో తారలు నేలరాలుతున్నాయి. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, చిరంజీవి సర్జా, సుశాంత్ సింగ్ వంటి వారు నింగికేగిన తరువాత రీసెంట్‌గా కన్నడ నటుడు సుశీల్ గౌడ మృత్యువాత పడ్డాడు. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడంపై సెలెబ్రిటీలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

సుశీల్ ఆత్మహత్య..

సుశీల్ ఆత్మహత్య..

కన్నడ బుల్లితెర హీరో సుశీల్ గౌడ మాండ్యలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా బయటకు రాలేదు. ఆయన మరణ వార్తను తెలుసుకున్న తోటీ నటీనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అలా ఫేమస్..

అలా ఫేమస్..

అంతపుర సీరియల్‌తో సుశీల్ ఫేమస్ కాగా.. రీసెంట్‌గా వెండితెరపైనా మెరిసేందుకు సిద్దమయ్యాడు. సాలాగా అనే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. అయితే కరోనా వచ్చి పరిస్థితులు ఇలా ఉండకపోతే ఈపాటికే ఆ చిత్రం రిలీజ్ అయ్యేది. కానీ దురదృష్టవశాత్తు తనను తాను వెండితెరపై చూసుకోకుండానే కన్ను మూశాడు.

శోక సంద్రంలో సన్నిహితులు..

శోక సంద్రంలో సన్నిహితులు..

అంతపుర సీరియల్ డైరెక్టర్ అరవింద్ కౌశిక్ , హీరోయిన్ అమిత రంగనాథ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. సుశీల్ డెబ్యూ చిత్ర డైరెక్టర్ దునియా విజయ్ కూడా మరణ వార్తను విని షాక్ అయ్యాడు. తాజాగా శ్రీ రెడ్డి చేసిన కామెంట్ కూడా తెగ వైరల్ అవుతోంది.

Recommended Video

Sushant Singh Rajput : Sri Reddy Comments Viral || వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో ?
ఎంత ధైర్యం..

ఎంత ధైర్యం..

ఎప్పుడూ వివాదాస్పద కామెంట్లు చేసే శ్రీ రెడ్డి ప్రస్తుతం బాగా ఎమోషనల్ అయింది. సుశీల్ గౌడ మరణంపై స్పందిస్తూ.. ‘సుశీల్ గౌడ.. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యం?, కానీ అందులో సగం ధైర్యాన్ని కూడబెట్టుకుని ఎందుకు జీవించాలని అనుకోలేదు. కన్నడ ఇండస్ట్రీయే కాదు మేము కూడా నిన్ను చాలా మిస్ అవుతాము. నా ప్రగాఢ సానుభూతి.. కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాల'ని పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X