ఈసారి తాప్సీపై కామెంట్స్.. అమ్మాయిలందరూ దానికి అర్హులే.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్
శ్రీ రెడ్డి చేసే కామెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేం. ఒక్కోసారి రాయడానికి, చెప్పడానికి వీల్లేకుండా ఉంటే ఒక్కోసారి ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. కరోనా వైరస్, వలస కార్మికులు, ప్రభుత్వ విధానాలపై శ్రీ రెడ్డి చేసే కామెంట్స్ ఆలోచించివిధంగా ఉంటే.. సినీ ప్రముఖులపై చేసే కామెంట్స్ కాస్త భిన్నంగా ఉంటాయి. శ్రీ రెడ్డి నిత్యం ఏదో ఒక విషయంపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా తాప్సీపై, తాప్సీ నటించిన తప్పడ్ మూవీపై కామెంట్స్ చేసింది.

ఏదో ఒక విషయంపై..
శ్రీ రెడ్డి స్పందించడానికి నిర్దిష్టమైన సంఘటన ఏదీ జరగాల్సిన పనే లేదు. ఆమె కామెంట్ చేశాకే అది ఓ వార్త అవుతుంది. సినీ రాజకీయ అంశాలపై నిత్యం స్పందించే శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీను టార్గెట్ చేస్తూ ఉంటుంది.

రానా వ్యక్తిగత విషయాలపైనా..
రానా వ్యక్తిగత విషయాలపైనా శ్రీరెడ్డి స్పందిస్తోంది. మిహీక బజాజ్ యస్ చెప్పిందని రానా ప్రకటించిన తరువాత శ్రీ రెడ్డి ఓ కామెంట్ చేసింది. మళ్లీ ఎంగేజ్‌మెంట్ జరగబోతోందని మరోక పోస్ట్ చేసింది. రానా బావా అంటూ సంభోదిస్తూ చేసిన ఆ పోస్ట్ తెగ వైరల్ అయింది.

ఫేక్ న్యూస్ రాసేవారిపైనా..
రీసెంట్‌గా శ్రీ రెడ్డి ఫేక్ న్యూస్ రాసేవారిపైనా కామెంట్ చేసింది. తనకు ఇంకా కనీసం ఒక్కసారి కూడా పెళ్లి కాలేదని అయితే వర్జినిటీని మాత్రం కోల్పోయానని చెబుతూ.. ఎవరైతే ఫేక్ న్యూస్ రాస్తారో వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

అమ్మాయిందరికీ అది ఉండాల్సిందే..
తాప్సీ నటించిన తప్పడ్ మూవీ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఓ మహిళ గౌరవానికి సంబంధించిన కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. ‘తప్పడ్ (చెంపదెబ్బ) సినిమా అనేది పిచ్చి, సాధారమైన ప్రేమ కథా చిత్రాలకు ఓ తప్పడ్ (చెంపదెబ్బ) లాంటిది. తాప్సీ గారు మీ నటనకు హ్యాట్సాఫ్.. అమ్మాయిలందరూ గౌరవింపదగిన వారే'నని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











