శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు.. ఒకే పోస్టుతో ఇద్దరిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. వివాదాస్పద వ్యవహార శైలితో ఈమె నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అంశం ఏదైనా తన స్పందనను తెలియజేస్తుంది. అదే సమయంలో తన చేతికొచ్చింది రాసుకొస్తుంది. దీంతో రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. శ్రీరెడ్డిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఆమె తరచూ 'బిగ్ బాస్' షోపై కామెంట్లు చేస్తూనే ఉంది. తాజాగా మరో పోస్టుతో వచ్చేసింది.

శ్వేతా రెడ్డికి సపోర్ట్

శ్వేతా రెడ్డికి సపోర్ట్

‘శ్వేతా రెడ్డి గారూ.. మీ దెబ్బకి బిగ్ బాస్ తెలుగు అట్టర్ ఫ్లాప్.. నాకు తమిళ బిగ్ బాస్ బాగా నచ్చింది. నా సపోర్ట్ మీకే శ్వేతా రెడ్డి' అంటూ కామెంట్ చేసింది శ్రీరెడ్డి. అలాగే ఆమెతో కలిసి దిగిన సెల్ఫీని సైతం సోషల్ మీడియాలో ఉంచింది. దీనికి ‘రెడ్డి పవర్' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

తమన్నాకి బిగ్ భయ్యా దొరికాడు

తమన్నాకి బిగ్ భయ్యా దొరికాడు

ఇక, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తమన్నాని ఉద్దేశించి ‘తమన్నాకి బిగ్ భయ్యా దొరికాడు.. నాగార్జున భయ్యా సెలక్షన్. సారీ రివేంజ్ బావుంది.. సోనా ఈజ్ బెస్ట్' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. అంతకు ముందు కూడా ‘నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలీవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో. ఇవ్వకపోతే బిగ్ బాస్ గాడు ఒక ఎదవ' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై నాగార్జున అభిమానులు విమర్శలు చేశారు.

హేమను ప్రశ్నిస్తూ..

హేమను ప్రశ్నిస్తూ..

తొలివారంలోనే బిగ్ బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయిన హేమను ఉద్దేశిస్తూ కూడా శ్రీరెడ్డి పోస్టు చేసిన విషయం తెలిసిందే. ‘హేమా.. అప్పుడు బిగ్ బాస్ గాడు పెద్ద తోపు అన్నారు. పాపం శ్వేతా రెడ్డి గారిని తిట్టారు. ఇప్పుడు మీరేమో బిగ్ బాస్ గాడిని చీటర్ అంటున్నారు.. ఏ' అంటూ ఆమెను ప్రశ్నించింది.

తాజాగా తమన్నాపై..

తాజాగా తమన్నాపై..

బిగ్ బాస్ హౌస్‌లో కొద్దిరోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమన్నా ఎంట్రీతోనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తమన్నాను ఉద్దేశిస్తూ తాజాగా ఓ పోస్ట్ చేసింది. ‘శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్న బిగ్ బాస్. తూ.. తెలుగు బిగ్ బాస్ నాశనం' అని అందులో పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X