twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ పోస్ట్: తల్లైన స్వాతినాయుడు.. చిరంజీవి ఫ్యామిలికి లింక్ పెట్టిన శ్రీరెడ్డి

    |

    టాలీవుడ్ సంచలన తార శ్రీ రెడ్డి, శృంగార తార స్వాతి నాయుడు ఇద్దరూ కలిసి ఒకే సారి వార్తల్లో నిలిచారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వాతి నాయుడు వార్తల్లోకెక్కితే.. ఆమెను అభినందిస్తూ శ్రీ రెడ్డి మరోసారి సెన్సేషన్ క్రియేషన్ చేసింది. మాములుగా అభినందిస్తే ఇంతగా వైరల్ కాకపోవును గానీ.. చిరంజీవి కుటుంబాన్ని మధ్యలోకి లాగడంతో అందర్నీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. సమయం సందర్భం లేకుండా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే శ్రీ రెడ్డి.. తాజాగా చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

    మెగా ఫ్యామిలీనే టార్గెట్..

    మెగా ఫ్యామిలీనే టార్గెట్..

    టాలీవుడ్‌పై విరుచుకుపడే ప్రతీసారి మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులను తీవ్ర స్థాయిలో దూషిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్, నాగబాబులను రాజకీయాంగానూ విమర్శిస్తూ పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. ఘటనతో నిమిత్తం లేకుండా మెగా ఫ్యామిలీపై పడుతూ ఉంటుంది. తాజాగా స్వాతినాయుడు విషయాన్ని ప్రస్థావిస్తూ చిరంజీవి మధ్యలోకి లాగింది.

    లాక్‌డౌన్‌లో సీమంతం

    లాక్‌డౌన్‌లో సీమంతం

    శృంగార తార స్వాతి నాయుడు యూ ట్యూబ్ వీడియోలు చూడని వారెవరూ ఉండరు. స్వాతి నాయుడు 2019లో తాను ప్రేమించిన అవినాష్‌ను వివాహం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం స్వాతినాయుడు సీమంతం వేడుక విజయవాడలో నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తెల్లవారు జామున పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. తాజాగా దీనిపై శ్రీ రెడ్డి స్పందించింది.

    చిరంజీవి కుటుంబానికి చెందిన దానివి కాదు కదా..

    చిరంజీవి కుటుంబానికి చెందిన దానివి కాదు కదా..

    స్వాతి నాయుడుకు పండంటి బిడ్డ పుట్టడంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. ‘కంగ్రాట్స్ స్వాతి.. ఏది ఏమైనప్పటికీ నువ్ చిరంజీవి కుటుంబానికి చెందినదానివి కాదు కదా.. అందుకే నీ బిడ్డ ఫోటో వైరల్ కాలేదు..అయినప్పటికీ గాడ్ బ్లెస్ యూ'అని పేర్కొంది. శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ బాగానే వైరల్ అవుతోంది.

    Recommended Video

    Vijay Devarakonda Gets Herat Touching Birthday Wishes
    హైపర్ ఆది పెళ్లిపైనా..

    హైపర్ ఆది పెళ్లిపైనా..

    స్వాతి నాయుడుకు కంగ్రాట్స్ చెప్పే కొద్ది క్షణాల క్రితమే హైపర్ ఆది, ఆయన పెళ్లి వార్తలపై మండిపడింది. ‘హైపర్ ఆది గాని పెళ్లైతే కరోనా చస్తదా? ఆన్‌లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల, 42 ఏళ్లలో ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏంది?' అని పోస్ట్ చేసింది.

    English summary
    Sri Reddy Congrats For Swathi Naidu Blessed A Baby. And She Made Comments On Her That SHe Is Not From Mega Family Sh Her Baby Pic Doesn't Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X