శ్రీరెడ్డి లొల్లితో మాయం.. మళ్లీ ‘ఓ బేబీ’ అంటూ దగ్గుబాటి అభిరామ్!

Recommended Video

Abhiram Daggubatti Back In Action, Soon To Launch As A Hero || Filmibeat Telugu

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే వెంకటేష్, రానా హీరోలుగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో కొనసాగుతుండగా.... రానా సోదరుడు అభిరామ్ కూడా నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అభిరామ్‌ను ఒక ప్రేమ కథా చిత్రం ద్వారా తెరంగ్రేటం చేయించేందుకు నిర్మాత సురేష్ బాబు ప్రయత్నాలు చేశారని, దర్శకుడు భానుశంకర్ చెప్పిన కథ నచ్చడంతో అతడితోనే తన చిన్న కొడుకును లాంచ్ చేసేందుకు రంగం కూడా సిద్ధం చేశారని, ముంబై బ్యూటీ మాళవిక శర్మ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అభిరామ్... శ్రీరెడ్డి వివాదంలో ఇరుక్కోవడంతో అతడిని హీరోగా లాంచ్ చేసే ప్లాన్ అన్నీ ఆగిపోయినట్లు టాక్.

శ్రీరెడ్డి వివాదంతో మాయం

శ్రీరెడ్డి వివాదంతో మాయం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఉధృతంగా ఆందోళన జరుగుతున్న సమయంలో శ్రీరెడ్డితో అభిరామ్ రొమాంటిక్ ఎఫైర్ నడిపిన విషయం వెలుగులోకి రావడం, ఈ ఇద్దరి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఈ వ్యవహారంతో అభిరామ్ కొంతకాలం ఎవరికీ కనిపించకుండా మాయం అయ్యారు.

ఈ వివాదం హైలెట్ కాకుండా జాగ్రత్త పడిన సురేష్ బాబు

ఈ వివాదం హైలెట్ కాకుండా జాగ్రత్త పడిన సురేష్ బాబు

అభిరామ్, శ్రీరెడ్డి ఇష్యూ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవ్వగా... నా పర్సనల్ విషయాలను నేను షేర్ చేయను. నాపై ఏదైనా వ్యక్తిగతంగా ప్రభావం చూపితే అది నా పర్సల్ సమస్య. దాన్ని నేను పరిష్కరించుకుంటాను. దాన్ని ప్రజలతో పంచుకోవాలనే ఆసక్తి నాకు లేదు. నాకు మాత్రమే కాదు ప్రతి ఫ్యామిలీకి పర్సనల్ సమస్యలు ఉంటాయి. నేను లైమ్ లైట్ లోకి వచ్చాను. నాకు సంబంధించిన కొన్ని సమస్యలపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ నేను పబ్లిక్ పర్సన్ కాదు. నా వ్యక్తిగత జీవితానికి, నా కుటుంబానికి సంబంధించిన విషయాలు పబ్లిక్ లోకి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు.... అని సురేష్ బాబు అన్నారు.

ఓ బేబీ అంటూ దగ్గుబాటి అభిరామ్

ఓ బేబీ అంటూ దగ్గుబాటి అభిరామ్

శ్రీరెడ్డి వ్యవహారం సర్దుకోవడంతో.... మళ్లీ దగ్గుబాటి అభిరామ్ పబ్లిక్‌లోకి రావడం మొదలు పెట్టారు. ఇటీవల ‘ఓ బేబీ' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొని సందడి చేశారు. సమంత, ఇతర యూనిట్ సభ్యులతో కలిసి రామానాయుడు స్టూడియో వద్ద సంబరాల్లో పాల్గొన్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ బాధ్యతల్లో చురుకుగా...

సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ బాధ్యతల్లో చురుకుగా...

అభిరామ్‌ను ఖాళీగా ఉంచకుండా సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియోకు సంబంధించిన పనుల్లో బిజీ చేశారట సురేష్ బాబు. ఇకపై ఎలాంటి వేషాలు వేయకుండా బుద్దిగా ఫ్యామిలీ బిజినెస్‌లో చేదోడు వాదోడుగా ఉండేలా అతడిని ట్రైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతా సెట్టయ్యాక హీరోగా...?

అంతా సెట్టయ్యాక హీరోగా...?

అంతా సెట్టయ్యాక అభిరామ్‌ను హీరోగా పరిచయం చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని సురేష్ బాబు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో దర్శకుడు భానుశంకర్ చెప్పిన కథతోనే ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X