మెగా ఫ్యామిలీలో ఆ ఒక్కరే ఇష్టం.. చిరంజీవిని దారుణంగా టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
బిగ్‌బాస్ ఫినాలె ఎపిసోడ్ ఎంత అట్టహాసంగా జరిగిందో అందరం చూశాం. బిగ్‌బాస్ టైటిల్, ట్రోఫీ అందజేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఫినాలె ఎపిసోడ్‌కు చిరు ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు. వచ్చీ రావడంతోనే నాగార్జునకు పంచ్ వేసిన చిరు.. అలా ఎంటర్టైన్ చేస్తూనే పోయాడు. వరుసబెట్టి కంటెస్టెంట్లను పలకరిస్తూ.. ఒక్కొక్కరి ప్రత్యేకతను పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చాడు.

తమన్నాను పొగిడిన చిరు..
అలా అందర్నీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చిన చిరు.. తమన్నా సింహాద్రి విషయానికి వచ్చే సరికి పాత విషయాన్ని ప్రస్తావించాడు. ఆ విషయమేంటన్నది మనిద్దరికే తెలుసు అంటూ చిరు చెప్పినా.. అదేంటన్నంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. శ్రీరెడ్డి విషయంలో తమన్నా సింహాద్రి తీసుకున్న స్టాండ్ గురించేనని అందరూ అనుకున్నారు. మీడియాలో అది తెగ వైరల్ అయింది. చివరకు ఆ కామెంట్లు శ్రీ రెడ్డి చెవిన పడ్డాయి.

ఫైర్ అయిన శ్రీరెడ్డి..
తాను అసలు ఈ విషయాల గురించి మాట్లాడదలచు కోలేదని, కానీ మాట్లాడాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారని సోషల్ మీడియా వేదికగా చెప్పింది. పవన్ కళ్యాణ్ గొప్పోడని చిరంజీవి, చిరంజీవి గొప్పోడని పవన్ కళ్యాణ్ చెప్పుకోవడం కాదని ప్రపంచం గుర్తించాలని పేర్కొంది. ప్రజారాజ్యంలో ఎంత సంపాదించావో ఎంత పోగొట్టుకున్నావో అంతా తెలుసునని గత విషయాలను తవ్వింది. అది చాలదనట్టు మెగా ఫ్యామిలీ హీరోలపైనా పడింది. వారే హీరోలుగా ఉండాలా మిగతా వారు రాకుడదా? మిగతా వారికి నటన రాదా? అంటూ ఓ వీడియోను వదిలింది.

మేము ధైర్యవంతుల్లా కనిపించలేదా..
ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అవమానాల గురించి మాట్లాడిన మేము, ఉద్యమం చేసిన మేము ధైర్యవంతుల్లా కనిపించలేదా?అని ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్‌ను అన్నానని మనసులో పెట్టుకున్నాడని అందుకే అలా మాట్లాడాడని.. ఇక ఈ వీడియో చూశాక మళ్లీ నన్ను తిడతారని, తొక్కేస్తారని, చంపినా చంపొచ్చని మాట్లాడుకుంటూ వచ్చింది. చిరంజీవి అలా మాట్లాడుతూ ఉంటే.. పక్కన ఉన్న నాగార్జున కూడా చప్పట్లు కొడుతున్నాడని.. ఇండస్ట్రీ ఎలాంటి వారి కబంధ హస్తాల్లో చిక్కుకుందో అర్థమవుతుందని చెప్పుకొచ్చింది.

మెగా ఫ్యామిలీ ఆ ఒక్కరే ఇష్టం..
మెగా ఫ్యామిలీ మొత్తంలో ఉపాసన అంటే ఇష్టమని, అంత మంచి మనిషి మీ ఫ్యామిలీలోకి ఎలా వచ్చిందోనని కౌంటర్ వేయసాగింది. ఆమె లేకుండా మీ ఫ్యామిలీ ఉండేదని కాదంటూ చెప్పుకొచ్చింది. ప్రతీ మనిషిలోమంచీ చెడూ రెండూ ఉంటాయని, తాను మంచిదాన్ని అని చెప్పుకోవడం లేదని అలాగని చెడ్డదాన్నని కూడా చెప్పుకోవడం లేదని తెలిపింది. నేను ఎలాంటి దాన్నో మీరే నిర్ణయించుకోండని ముగించేసింది.


Click it and Unblock the Notifications











