బాలయ్యకు సపోర్టుగా నాగబాబుకు శ్రీరెడ్డి కౌంటర్... పవన్ మీద వీడియోతో సంచలనం!
Recommended Video

నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ మెగాబ్రదర్ నాగబాబు వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ స్టార్లపై బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి వేడిరగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి రంగంలోకి దిగి బాలయ్యకు సపోర్టుగా ఎటాక్ ప్రారంభించడం చర్చనీయాంశం అయింది.
గతంలో కాస్టింగ్ కౌచ్ అంశానికి సంబంధించిన వివాదంలో పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా మారిన శ్రీరెడ్డి సందుదొరికినప్పుడల్లా ఆయన్ను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు మరోసారి అవకాశం దొరకడంతో ఆమె తన ప్రతాపం చూపించారు.

బాలయ్యబాబుతో పెట్టుకుంటే ఇంతే...
‘‘పవనప్ కళ్యాణ్ అంటే ఎవరు? టిట్ ఫర్ టాట్ ఫర్ నాగబాబు గారు... బాలయ్యబాబుతో పెట్టుకుంటే ఇంతే'' అంటూ ఓ వీడియో విడుదల చేశారు. చాలా మంది ఆర్టిస్ట్ పవన్ గురించి మాట్లాడాలని కోరుతున్నారు. ఆయన గురించి మాట్లాడేదేముందండీ? ఆయన మంచి ఆర్టిస్టు.. చాలా టాలెంటెడ్ పర్సన్. పేయింటింగ్ అలవోకగా వేస్తారు. ఆయన పూర్తి పేరు పవన్ బన్వాల్. నాకు ఆ పవన్ తప్ప వేరే పవన్ ఎవరూ తెలియదు అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

పవన్ అంటే దొంగచూపులు చూస్తూ దొంగ కోళ్లు పట్టేవాడిలా ఉంటారంట!
"ఆంధ్ర నుంచి కొంత మంది ఫోన్ చేసి చెప్పారు. పవన్ అంటే దొంగచూపులు చూస్తూ దొంగ కోళ్లు పట్టేవాడిలా ఉంటారంట! చదువురాక ఒకటికి రెండు సార్లు మహానుభావుల గురించి తప్పులు మాట్లాడతారంట.. లక్ష పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకుంటారంట.... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

ఆయన ఫ్యాన్స్ ఏకమైతే తట్టుకోవడం కష్టం
పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ.. దేశ సేవ అనే డైలాగ్స్ కొడుతూ.. ఎలక్షన్ ముందు ఏదేదో సొల్లు చెప్పి తనకంటే సీనియర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి లాంటివారిని కించ పరుస్తున్నారు. మీ అన్నయ్యగారు రాక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ ఏకమైతే తట్టుకోవడం కష్టమని శ్రీరెడ్డి తెలిపారు.
ఈయనేనా పవన్ అంటే? మాకు తెలియదండీ...
పన్నెండేళ్ల పిల్లలను వెంటేసుకుని వారితో అరిపించుకున్నంత మాత్రాన పొలిటికల్‌గా స్ట్రాంగ్ అయ్యారనుకోవడం... సీఎం అవుతాననుకోవడం అవివేకం. కులం పిచ్చి లేదంటూనే మీ కులం వారికే సీట్లు ఇవ్వడం, అమ్మాయిల పిచ్చి లేదంటూనే అమ్మాయిల చుట్టూ తిరగడం... ఈయనా? పవన్ గారంటే మాకు తెలియదండీ అంటూ శ్రీరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











