రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్.. అసభ్య పదజాలంతో పోస్ట్
పవన్ కళ్యాణ్, శ్రీ రెడ్డి మధ్య ఉన్న గొడవ అందరికీ తెలిసిందే. అసభ్య పదజాలంతో మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్‌పై రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం అంటూ అప్పట్లో హల్చల్ చేసిన శ్రీ రెడ్డి రామ్ గోపాల్ వర్మ సలహాతో పవన్ కళ్యాణ్, ఆయన అమ్మను తిట్టడం సంచలనంగా మారింది. దీంతో వ్యవహారమంతా తారుమారైంది.

చెన్నైలో మకాం..
అప్పటి వరకు శ్రీ రెడ్డిని హైలెట్ చేస్తూ చూపించిన మీడియా.. పవన్ వ్యవహారంతో అంతా మారిపోయింది. పవన్ కళ్యాణ్ అమ్మను దారుణంగా తిట్టడంతో శ్రీరెడ్డికి వచ్చిన సానుభూతి అంతాపోయింది. దెబ్బకు మకాం కూడా మార్చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో సెటిలైంది.

గతకొన్ని రోజులుగా హల్చల్..
అన్నింటిని మరిచిపోయి యూట్యూబ్‌లో వంటల ప్రోగ్రామ్ చేసుకుంటూ కాలం గడిపేయసాగింది శ్రీ రెడ్డి. రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలతో మళ్లీ రగడ మొదలైంది. ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కరాటే కళ్యాణి, మెగా ఫ్యామిలీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా అందరిపైనా విరుచుకుపడింది. దీంతో పోలీసు కేసులు నమోదు చేయడం ఇదంతా కొన్ని రోజులుగా నానుతూ ఉంది.

పరోక్షంగా శ్రీరెడ్డిపై కౌంటర్..
జనసేన ఆరవ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం శ్రీరెడ్డికి పరోక్షంగా కౌంటర్ వేసినట్టు ఉంటుంది. తనను , తన తల్లిని ఎంత ధూషించినా సైలెంట్‌గా ఉన్నానని, రాజకీయాల్లోకి వచ్చాను, కోపాన్ని తగ్గించుకున్నానని, అంటూ చెప్పుకొచ్చాడు.
Recommended Video

రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..
పవన్ వ్యాఖ్యలకు శ్రీ రెడ్డి రివర్స్ కౌంటర్ వేస్తూ అసభ్య పదజాలాన్ని ప్రయోగించింది. నువ్వు ఇప్పుడు పొలిటిషియన్ ఎవరన్నారు పీకే.. ప్రజా సేవా చేస్తా అని మళ్లీ సినిమాలు చేసుకుంటున్నావ్.. నన్ను అనేంత బాల్స్ ఉన్నాయా నీకు అంటూ రెచ్చిపోయింది.


Click it and Unblock the Notifications











