twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    20 ఏళ్లుగా ఎదురుచూశాను.. వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీరెడ్డి.. అసలు సంగతి ఏంటంటే?

    |

    2020 ఏడాదిలో ఎన్నో వింతలు, విచిత్రాలు జరిగాయి. అందులో ఎంతో మందికి బాధ కలిగించే ఘటనలెన్నో సంభవించాయి. రజనీకాంత్ అభిమానులకు మాత్రం ఈ 2020 తీవ్ర నిరాశను కలిగించింది. డిసెంబర్‌లోనే రాజకీయ అరంగేట్రం ఉంటుందని అంతా భావించారు. కానీ చివరకు మాత్రం మళ్లీ నిరాశే ఎదురైంది. రజనీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మళ్లీ పునరాలోచనలో పడ్డాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సలహా మేరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

    పూర్తి విరామం..

    పూర్తి విరామం..

    అన్నాత్తె షూటింగ్‌లో కరోనా కలకలం సృష్టించడం, యూనిట్ సభ్యులకు కరోనా సోకడం అందరికీ తెలిసిందే. ఆ తరువాత రజనీకాంత్ క్వారంటైన్‌కు పరిమితం కావడం, మళ్లీ అస్వస్థతకు గురి కావడం కూడా తెలిసిందే. రక్తపోటు సమస్యలు, కిడ్నీ ఆపరేషన్ జరగడం ఇవన్నీ ప్రభావం చూపేలా ఉన్నాయని వైద్యులు హెచ్చరించడం, ప్రస్తుతం పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం అందరికీ తెలిసిందే.

    రాజకీయాలకు దూరంగా..

    రాజకీయాలకు దూరంగా..

    రజనీకాంత్ తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవ్వరినీ బాధపెట్టకూడదని రాజకీయ ఆలోచనలను విరమించుకున్నాడు. ఇకపై నో పాలిటిక్స్, నో పార్టీ అంటూ ప్రకటించేశాడు. ఈ నిర్ణయం మీ అందరినీ బాధపెడుతుందని తెలుసంటూ రజనీ ఎమోషనల్ అయ్యాడు.

    భిన్నాభిప్రాయాలు..

    భిన్నాభిప్రాయాలు..

    రజనీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రజనీ అభిమానులు కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. రాజకీయంగా వెనుకడుగు వేయడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కానీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రం రజనీ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.

    వారంతా మద్దతుగా..

    వారంతా మద్దతుగా..

    రజనీ నిర్ణయానికి కుటుంబం మొత్తం అండగా నిలబడింది. అంతే కాకుండా సినీ ప్రముఖులైన రాధికా, భారతీరాజా, కార్తీక్ సుబ్బరాజు, కస్తూరి, వనిత విజయ్ కుమార్, మోహన్ బాబు వంటి వారంతా కూడా రజనీ నిర్ణయాన్ని సమర్ధించారు. కోలీవుడ్ ప్రముఖులందరూ రజనీకే మద్దతు తెలిపారు.

    తాజాగా శ్రీరెడ్డి..

    తాజాగా శ్రీరెడ్డి..

    అయితే శ్రీ రెడ్డి మాత్రం రజనీ నిర్ణయం పట్ల తీవ్ర నిరాశకు లోనైంది. వెక్కి వెక్కి ఏడ్చేసింది. గత 20 ఏళ్లుగా రజనీ పార్టీ పెడతారని, అందులో జాయిన్ అవుదామని ఎంతో ఎదురుచూశానని చివరకు ఇలా జరిగిపోయిందంటూ శ్రీరెడ్డి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Sri reddy cried About Rajinikanth Political Back step, Mohan Babu About Rajinikanth Political Back step, Bharathiraja About ABout Rajinikanth Political Back Step, vanitha Vijayakumar ABout Rajinikanth Political decision, vanitha Vijayakumar ABout Rajinikanth Health, South Super Star Rajinikanth joined in Apollo hospital due to ill health on Friday. As per Apollo bulletin, Rajinikanth suffering with High BP and breath issues. Earlier He was tested coronavirus positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X