రాజకీయాల్లోకి ఎంటరవుతున్నట్లు ప్రకటించిన శ్రీరెడ్డి... ఏ పార్టీ?
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో నటి శ్రీరెడ్డి సృష్టించిన వివాదాలకు రెండు ఇండస్ట్రీలు షేక్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ స్టార్లను, దర్శకులను, నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ఆరోపణలు, వివాదాస్పద కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
శ్రీరెడ్డి తమ పేరు బయట పెడుతుందేమో అని బేంభేలెత్తిపోయిన సినీ ప్రముఖులు ఆమె ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేయడానికి కూడా సాహసించలేదు. ఆయా ప్రముఖుల చీకటి భాగోతాలకు సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నట్లు శ్రీరెడ్డి సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే.

త్వరలో రాజకీయాల్లోకి శ్రీరెడ్డి
ప్రస్తుతం తమిళనాడులో సెటిలై అక్కడే సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ సాగిస్తున్న ఈ వివాదాస్పద నటి త్వరలో రాజకీయాల్లోకి ఎంటరయ్యే ఆలోచనలో ఉందట. ఏపీ, తెలంగాణ పాలిటిక్స్‌కు సంబంధించిన అంశాల్లో యాక్టివ్‌గా ఉంటూ ఈ రంగంపై అవగాహన పెంచుకున్న ఆమె త్వరలో తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనలో ఉందట.

తెలుగు పొలిటీషియన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదు
శ్రీరెడ్డి రాజకీయాల్లోకి వస్తున్న మాట నిజమే కానీ... తెలుగు పొలిటీషియన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు. ఎందుకంటే ఆమె తమిళనాడు రాజకీయాలపై మాత్రమే ఆమె ఆసక్తి చూపుతున్నారట. త్వరలో తాను తమిళనాడులోని ఓ పెద్ద రాజకీయ పార్టీలో చేరబోతున్నట్లు శ్రీరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఏ పార్టీలో చేరబోతోంది?
అయితే శ్రీరెడ్డి ఏ పార్టీలో చేరబోతోంది? అనే విషయం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆమె ఎక్కడికి వెళ్లినా వివాదాలు మాత్రం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తమిళనాట శ్రీరెడ్డికి ఆదరణ
తెలుగులో కొన్ని వివాదాల కారణంగా ఇక్కడ నెగెటివ్ ఇమేజ్ మూటగట్టుకున్న శ్రీరెడ్డి... చెన్నైలో సెటిలైన అక్కడి ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తోంది. మరి శ్రీరెడ్డి తమిళ రాజకీయ ఆరంగ్రేటం ఏ పార్టీ ద్వారా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











