twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కొక్కడి తాట ఒలుస్తా, నెక్ట్స్ పెద్దతలకాయలే: ఎయిడ్స్ రూమర్లపై శ్రీరెడ్డి ఫైర్, 41 కేసులు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Sri Reddy Strict Warning To Industry Celebrities

    కాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలోని ఇతర సమస్యలపై పోరాటం చేసే క్రమంలో నటి శ్రీరెడ్డి రకరకాల విమర్శలు, కామెంట్లు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కొందరు ఆమెను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎయిడ్స్ వచ్చి చనిపోయినట్లు కూడా ప్రచారం చేశారు. తనను ఎవరైతే టార్గెట్ చేశారో వారందరిపై కేసులు పెట్టుకుంటూ వెళుతోంది శ్రీరెడ్డి. ఇటీవల హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో 30 మందిపై ఫిర్యాదు చేసిన శ్రీరెడ్డి, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరుకు మొత్తం 41 మందిపై కేసులు పెట్టినట్లు ఆమె తెలిపారు.

    ఒక్కొక్కరి తాట ఒలుస్తా, నెక్ట్స్ పెద్ద తలకాయలే

    ఒక్కొక్కరి తాట ఒలుస్తా, నెక్ట్స్ పెద్ద తలకాయలే

    సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేసిన అనంతరం శ్రీరెడ్డి తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు. ఇక ఒక్కొక్కరి తాట ఒలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్లలంటే మీ ఇష్టారాజ్యానికి ఏమైనా తిట్టొచ్చు అనుకునేదానికి ఇక చెల్లు చీటి, ఇప్పటికి 41 మందిపై కేసులు పెట్టాను. నెక్ట్స్ పెద్ద తలకాయలే అంటూ శ్రీరెడ్డి హెచ్చరించారు.

    ఎయిడ్స్ వచ్చి చనిపోయినట్లు ప్రచారం

    ఎయిడ్స్ వచ్చి చనిపోయినట్లు ప్రచారం

    సోషల్ మీడియాలో కొందరు తనపై దారుణమైన రూమర్స్ ప్రచారం చేశారని, తాను ఎయిడ్స్ వచ్చి చనిపోయినట్లు మార్పింగ్ వీడియో క్రియేట్ చేశారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    వారిపై చర్యలు తీసుకోండి

    వారిపై చర్యలు తీసుకోండి

    సొసైటీలో తన క్యారెక్టర్ డిఫేమ్ చేసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారు మాట్లాడిన వీడియోలను యూట్యూబ్ నుండి తొలగించాలని శ్రీరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ప్రముఖుల పేర్లు పేర్కొంటూ శ్రీరెడ్డి ఫిర్యాదు

    ప్రముఖుల పేర్లు పేర్కొంటూ శ్రీరెడ్డి ఫిర్యాదు

    జీవిత రాజశేఖర్, కరాటే కళ్యాణి, డైరెక్టర్ రాధాకృష్ణ, సత్య చౌదరి, రాధా బంగారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తదితరుల పేర్లను పేర్కొంటూ వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి ఫిర్యాదు చేశారు.

    English summary
    Sri Reddy lodged complaint against 41 people in Cyber Crimes Police Station. In the complaint, Sri Reddy breathed fire on Pawan Fans for allegedly troubling her on social media. She sought action against PK Fans Groups on Twitter and Facebook.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X