హీరో, దర్శకుడితో పాటు 30 మందిపై శ్రీరెడ్డి ఫిర్యాదు: సోషల్ మీడియాలో కంప్లయింట్ కాపీ!
Recommended Video

కాస్టింగ్ కౌచ్, సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తన సంచలన చర్యలతో మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ ముందు బట్టలు విప్పి అర్దనగ్నంగా నిరసన తెలుపడం ద్వారా శ్రీరెడ్డి వ్యవహారం జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలో శ్రీరెడ్డి కొందరు హీరోలు, డైరెక్టర్ల మీద ఆరోపణలు చేయడం, వారి అభిమానులు, మద్దతు దారులు ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేయడం తెలిసిందే. కొందరు తనను వేధించారని, బెదిరించారని శ్రీరెడ్డి ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీరెడ్డి
తమ హక్కులు, సమస్యలపై పోరాటం చేస్తుంటే కొందరు తమను అసభ్య పదజాలంతో దూషించడం, బెదిరింపులకు పాల్పడటం లాంటివి చేశారంటూ శ్రీరెడ్డి పోలీసులను సంప్రదించారు. టీవీ ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా తనపై కామెంట్లు చేసిన దాదాపు 30 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో కంప్లయింట్ కాపీలు
శ్రీరెడ్డి ఫిర్యాదు చేసిన వారిలో జీవిత రాజశేఖర్, కరాటే కళ్యాణి, కొందరు డైరెక్టర్లు, హీరోలు, నటీమనులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, గబ్బర్ సింగ్ బ్యాచ్, ఇంకా కొన్ని వెబ్ సైట్ల పేర్లు సైతం ఉన్నాయి.

ఎవరినీ వదలని శ్రీరెడ్డి
తనకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన, వేధింపులకు గురి చేసి, బెదిరించి వారందరిపైనా ఆమె కేసు పెట్టారు. తన పోరాటాన్ని తప్పుబడుతూ కామెంట్లు చేసిన వారిని సైతం శ్రీరెడ్డి వదల్లేదని ఈ కప్లయంట్ కాపీలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

ధైర్యంగా ముందుకు రావాలని పిలుపు
సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా వేధింపులకు గురి చేసినా, దూషణకు దిగినా, దాడి చేసినా అమ్మాయిలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని, వారికి తాము అండగా ఉంటామని శ్రీరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కంప్లయింట్‌లో పేర్కొన్న కొన్ని పేర్లు
జీవిత రాజశేఖర్
ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్
యోగి కుమార్(షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్)
అశ్వారావు పేట కుర్రాళ్లు
వైష్ణవి జూనియర్ ఆర్టిస్ట్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్
గాయిత్రి గుప్తా
అరవింద్ 2 హీరో
అజయ్ కౌండిన్య
రాఘవ రెడ్డి
కళ్యాణ్ దీప్ సుంకర
శకలక శంకర్


Click it and Unblock the Notifications











