రకుల్ ప్రీత్‌కు బుర్ర లేదు.. ఆమె ఓ లూజ్.. డబ్బు పిచ్చి.. శ్రీరెడ్డి ఫైర్
సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి ఫైర్ అయింది. తాను పోరాటం చేసేటప్పుడు మద్దతివ్వకుండా కొందరు ప్రస్తుతం పబ్లిసిటీ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొంటున్నారని విమర్శించింది. రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీపై తీవ్ర పదజాలంతో దూషించింది. శ్రీరెడ్డి ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే.

రకుల్ ప్రీత్ సింగ్‌పై ఫైర్
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై నేను మాట్లాడినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నేను మాట్లాడినప్పుడు హీరోయిన్ టాలీవుడ్‌లో అలాంటి వాతావరణం లేదు. నేను చూడలేదు. నాకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. నన్ను ఎవరూ వేధింపులకు గురిచేయలేదు అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది.

మాట మార్చిన రకుల్
బాలీవుడ్‌లో నానా పాటేకర్‌పై తను శ్రీ దత్తా ఆరోపణలు చేసిన తర్వాత తన మాట మార్చింది. అలాంటి ఉండకూడదు. ఉంటే పరిస్థితి మారాలి అంటూ రకుల్ ప్రీత్ మీడియాకు చెప్పింది. అలా రకుల్ మాట్లాడటం సరికాదు అని శ్రీరెడ్డి మండిపడింది.

రకుల్ ప్రీత్ బుర్ర పనిచేస్తుందా?
ఇలా రెండు రకాలుగా మాట్లాడంపై తగదు. రకుల్ ప్రీత్‌కు బుర్ర పనిచేస్తుందా? ఆమెకు లూజ్ ఉండవచ్చు. ఆమెకు కేవలం డబ్బే ప్రాధాన్యంగా కనిపిస్తున్నది. ఆమె క్యారెక్టర్ లేదు. నాలాంటి మహిళా నటిపై బురద జల్లడం నా ఉద్దేశం కాదు. కానీ ఎవరైనా ఓ సమస్యపై మాట్లాడుతున్నప్పుడు దానికి సపోర్ట్‌గా ఇవ్వకపోయినా.. వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని శ్రీరెడ్డి అభిప్రాయపడింది.

మీటూ అంటూ పబ్లిసిటీ కోసమేనా?
టాలీవుడ్‌లో మాట్లాడినప్పుడు లేదని, బాలీవుడ్‌లో ఉందనే విధంగా చెప్పడం సరికాదు. నేను మాట్లాడినప్పడు లైంగిక వేధింపులు లేవని చెప్పి.. బాలీవుడ్‌లో బయటపడగానే దానికి సపోర్ట్ తెలుపడం పబ్లిసిటీ కోసమేనా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

మంచులక్ష్మీపై మండిపాటు
మీ టూ ఉద్యమంపై మంచు లక్ష్మీ స్పందించడంపై శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. వైజాగ్ టైమ్స్‌లో మంచు లక్ష్మి స్టేట్ మెంట్ చూశాను. నేను పోరాటం మొదలుపెట్టినప్పుడు మద్దతు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు గ్రూపులు క్రియేట్ చేసి పోరాటం చేస్తున్నామని మంచులక్ష్మి చెప్పడం కరెక్టేనా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

ఉత్తరాది హీరోయిన్లపైనే ప్రేమ
తెలుగు అమ్మాయిలకు సమస్యలు ఉంటే పట్టించకోరు. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తే ఆదరించరు. వారికి కేవలం బెంగళూరు, ఉత్తరాది నుంచి వచ్చే వారిని మోస్తుంటారు అని శ్రీరెడ్డి దుయ్యబట్టింది. లైంగిక వేధింపులపై వారు చేస్తున్నది పోరాటం కాదు. కేవలం హడావిడి మాత్రమే.


Click it and Unblock the Notifications











