For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అది నోరా, చూస్తే వాంతులు.. అన్ని మూసుకోని కూర్చొ.. మంచు లక్ష్మీపై శ్రీరెడ్డి ఫైర్.. మనోజ్‌ విడాకులపై

  |

  దేశాన్ని కుదిపేసిన దిశ ఘటన. అత్యంత క్రూరంగా ప్రవర్తించిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే ఆ నలుగురి ఎన్‌కౌంటర్ అనంతరం.. పోలీసులపై ప్రశంసల వర్షం కురుపించారు. మరోవైపు ఓ వర్గం పనిగట్టుకుని ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తున్నారు. మానవ హక్కుల సంఘం కూడా వచ్చి.. పోలీసుల తీరును తప్పుబట్టింది. ఈ క్రమంలో కొందరు సెలెబ్రిటీలు సమర్ధించగా.. మరికొందరు పెదవి విరుస్తున్నారు. మంచు లక్ష్మీ సైతం ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ.. తన అభిప్రాయాన్ని చెప్పగా తాజాగా శ్రీరెడ్డి ఆమెపై ఫైర్ అయింది.

  స్పందించిన టాలీవుడ్..

  స్పందించిన టాలీవుడ్..

  దిశ ఘటనపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరూ స్పందించారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు దిశ ఘటనపై స్పందించగా.. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలందరూ స్పందించారు. టాలీవుడ్ మొత్తం ఈ ఘటనను ఖండిస్తూ.. వారిని కఠినంగా శిక్షించాలని కోరింది.

  ఎన్‌కౌంటర్‌ను తప్పుబట్టిన మంచు లక్ష్మీ..

  ఎన్‌కౌంటర్‌ను తప్పుబట్టిన మంచు లక్ష్మీ..

  ‘తప్పు చేసిన వారిని వెంటనే శిక్ష పడినందుకు సంతోషం. కానీ ఇది నిజంగా న్యాయమేనా? ప్రతిసారి దోషులను ఎన్‌కౌంటర్‌ చేసి చంపేయలేరు. చంపేయాలని అందరూ కోరుకుంటారు. ఎంతమందిని ఎన్‌కౌంటర్‌ చేసుకుంటూ వెళతారు? చనిపోయిన నలుగురు నిందితుల తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారు? వాళ్లను చూస్తుంటే నిరాక్షరాస్యుల్లా ఉన్నారు. ఎన్నో కష్టాలు పడి వాళ్లు తమ పిల్లలను ఇప్పటివరకు పెంచుకుంది ఇలా దారుణంగా చనిపోవడానికా? ఇది ఎందుకు జరుగుతోంది? నిర్భయ కేసులో దోషులకు శిక్ష పడి ఏడేళ్లు గడిచినా ఇప్పటివరకు అమలు చేయలేదు' అంటూ ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది.

  శ్రీ రెడ్డి ఫైర్..

  శ్రీ రెడ్డి ఫైర్..

  పోలీసుల ఎన్‌కౌంటర్‌ను స్వాగతించిన శ్రీరెడ్డి వారిపై ప్రశంసల వర్షం కురిపించింది. అయితే మంచు లక్ష్మీ లేవనెత్తిన అంశాలపై ఫైర్ అవుతూ.. ఆమెను ఏకిపారేసింది. అది నోరా అంటూ ఆమెపై విరుచుకుపడింది. ఆ నలుగురు తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో? అంటావా.. అలా పెంచినందుకు వారు కూడా శిక్షార్హులేనంటూ చెప్పుకొచ్చింది. పేద వాళ్లు కాబట్టి కాల్చేశారు.. అదే పెద్దవారైతే చేస్తారా? అని అడిగావు.. నాడు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడావా? అంటూ సెటైర్ వేసింది.

  తండ్రి మాటలు వింటే..

  తండ్రి మాటలు వింటే..

  తండ్రి చెప్పిన మాటలు వింటే నువ్వు, నేను ఎంతో బాగుపడే వాళ్లమంటూ చురక అంటించింది. బాలీవుడ్ స్పందించింది కాబట్టి.. మనం కూడా స్పందించాలని ఇక్కడి వారంతా మాట్లాడారని చెప్పుకొచ్చింది. ఎంతైనా బాలీవుడ్ స్టైల్ ఫాలో అయ్యే వారు కదా అంటూ కామెంట్ చేసింది. మూతికి ముక్కులు ఆపరేషన్‌లు చేసుకోవడం.. కాస్త సమాజంలో ఏం జరుగుతుందో చూడండి.. సమాజ సేవ చేయండి.. అప్పుడు మీ సెలెబ్రిటీ స్టేటస్‌కు ఓ విలువ ఉంటుందని ఫైర్ అయింది.

   పెద్దింట్లో పిల్లలకూ శిక్షలు..

  పెద్దింట్లో పిల్లలకూ శిక్షలు..

  ‘పెద్దవారికి కూడా అలాంటి చట్టాలే వర్తిస్తాయా? అని అడిగావ్ కదా.. పెద్దింట్లో పిల్లలు యాక్సిడెంట్‌లో ఎలా పోతున్నారో చూస్తున్నావ్ కదా.. వాళ్లపై రైడ్స్, కిడ్నీ రోగాలు వస్తున్నాయ్. అందరికీ శిక్షలు పడుతాయ్' అని పెట్రేగిపోయింది.

  ఆ పెదాలు చూస్తే వాంతులు..

  ఆ పెదాలు చూస్తే వాంతులు..

  ‘మొహం కడుక్కున్నావో లేదో తెలీదు.. ఆ పెదాలు చూస్తే వాంతోచ్చేలా ఉన్నాయి.. కనీసం మొహం కడుక్కుని రా.. ఆ పాచి మొహాలేసుకుని మీడియా ముందు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు' అంటూ రెచ్చిపోయింది.

  CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
  మనోజ్‌ను కూడా లాగేసింది..

  మనోజ్‌ను కూడా లాగేసింది..

  ‘అన్ని మూసుకుని కూర్చుంటే మంచిది అంటూ మీ ఇంట్లో డైవర్స్ లాంటివి జరగడం లేదా? అని ప్రశ్నించింది. మనోజ్ బాబుపై నాకు మంచి అభిప్రాయం ఉంది.. ఓ మనిషి ఇంకో మనిషికి ఇబ్బందిగా మారినప్పుడు వారి విడిపోవాల్సి వస్తుంది.. అది క్రూయల్‌గానా? శాంతంగానా? అన్నది అప్పుడున్న పరిస్థితిని బట్టి ఉంటుంది' అంటూ మనోజ్ విడాకుల సంగతిని ప్రస్థావించింది.

  English summary
  Sri Reddy Fires On Manchu Lakshmi Over Police Encounter. Earlier Manchu Lakshmi Didn't Supports For Encounter. On This Statement Of Manchu Lakshmi Sri Reddy Fires On Her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X