దమ్ముంటే అడ్రస్ పెట్టురా.. వెతికి వెతికి కొడతా.. పచ్చి బూతులతో రాకేష్ మాస్టర్‌పై శ్రీరెడ్డి ఫైర్
రాకేష్ మాస్టర్, శ్రీ రెడ్డి మధ్య వివాదం ఇప్పుడు మొదలైంది కాదు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఆ మధ్య యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పరస్పరం కామెంట్లు చేసుకోవడం, బహిరంగ సవాల్‌లు విసురుకోవడంతో రచ్చ మొదలైంది. ఇక అప్పటి నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూనే ఉంటారు. తాజాగా ఇండస్ట్రీపై బాలకృష్ణ చేసిన కామెంట్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద జరుగుతున్న వివాదంపైనా రాకేష్ మాస్టర్ స్పందించాడు. వాటిని ఉద్దేశిస్తూ శ్రీ రెడ్డి రాకేష్ మాస్టర్‌ను ఓ రేంజ్‌లో దూషించింది.

రాకేష్ మాస్టర్ కామెంట్స్..
సినీ ఇండస్ట్రీపై, పెద్ద హీరోలు, పరిశ్రమలోని లొసుగులపై నిత్యం ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు చేస్తూనే ఉంటాడు. యూట్యూబ్‌లో ఓ ఛానెల్ పెట్టి అందులో వీటికి సంబంధించిన వీడియోలను పెడుతుంటాడు.రాకేష్ మాస్టర్ చేసే కామెంట్లు, ఆరోపణలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. మెగా, నందమూరి, దగ్గుబాటి అని తేడా లేకుండా అందరి మీదా కామెంట్స్ చేస్తూ ఉంటాడు.

రాకేష్ మాస్టర్ వర్సెస్ శ్రీ రెడ్డి..
రాకేష్ మాస్టర్ గొడవ పెట్టుకోని ఆర్టిస్ట్ ఎవ్వరూ మిగల్లేదు. మాధవీలత, శ్రీరెడ్డి ఇలా ప్రతీ ఒక్కరిపైనా కామెంట్స్ చేశాడు. మాధవీలత అయితే ఏకంగా లీగల్ నోటీసులు కూడా పంపింది. శ్రీ రెడ్డి మాత్రం తన ఫేస్ బుక్ పేజీలో రాకేష్ మాస్టర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలంతో పోస్ట్‌లు చేస్తుంది.

తాజా వివాదాలపై..
ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో చర్చించడం, దానికి బాలయ్యను పిలవకపోవడంతో భూములు పంచుకుంటున్నారని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు మీరా చోప్రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ రెంటిపై రాకేష్ మాస్టర్ స్పందిస్తూ బాలయ్యను సమర్థించాడు. ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశాడు.
Recommended Video

పచ్చిబూతులతో శ్రీ రెడ్డి..
ఇక రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి ఫైర్ అయింది. రాయడానికి, వినడానికి వీలు కాని పదాలతో పచ్చి బూతులతో రాకేష్ మాష్టర్‌ను ఇష్టమొచ్చినట్టు దూషించింది. ఎన్టీఆర్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను తిట్టడం ఆపక పోతే.. ఎక్కడున్నాడో తెలుసుకుని మరి వెతికి వెతికి కొడతానని వార్నింగ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











