శ్రీరెడ్డి హీరోయిన్‌గా ‘రెడ్డి డైరీ’.... టాలీవుడ్, కోలీవుడ్ చీకటి కోణాలన్నీ?
కాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి తేవడమేకాదు సీరియస్‌గా ఆందోళన కార్యక్రమాలు, పలువురు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తూ ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు అటు తమిళ సినీ పరిశ్రమను షేక్ చేసింది శ్రీరెడ్డి. కొన్ని రోజులుగా తమిళనాడులో పాగా వేసిన శ్రీరెడ్డి ఏఆర్ మురుగదాస్, రాఘవ లారెన్స్, సుందర్ సి లాంటి వారిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది? హీరోయిన్ అవ్వాలనే కలలుకంటూ వచ్చిన అమ్మాయిలను ఇక్కడ ఎలా వాడుకుంటున్నారో పలు సందర్భాల్లో ఆమె వివరించారు.
Recommended Video


‘రెడ్డి డైరీ’ మూవీ
శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆమె ప్రధాన పాత్రలో ‘రెడ్డి డైరీ' అనే తమిళ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ చూస్తుంటే శ్రీరెడ్డి జీవితంలో జరిగిన పలు సంఘటనలు ఇందులో చూపించబోతున్నట్లు భావిస్తున్నారు.

సంతోషంగా కనిపించిన శ్రీరెడ్డి
చాలా సంతోషంగా ఉంది, అమ్మ(మేడమ్ జయలలిత) ఆశీస్సులతో తొలి తమిళ సినిమా ఓపెనింగ్. సినిమా పేరు ‘రెడ్డి డైరీ'... దర్శకుడు చిత్రై సెల్వం, నిర్మాత రవిదేవన్.... మమ్మల్ని ఆశీర్వదించండి అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

అందరి భాగోతాలు బయట పెడతారా?
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలోని చీకటి కోణాలు, ఇక్కడ కొందరు దర్శకుడు, హీరోలు, నిర్మాతలు మహిళలను ఎలా ట్రీట్ చేస్తారు? తమ కోరికలు తీర్చుకోవడానికి వారిని ఎలా ట్రాప్ చేస్తారు, లైంగికంగా ఎలా వాడుకుంటారు అనే విషయాలు ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.
శ్రీరెడ్డి పోస్ట్
దీనికంటే ముందు కేరళ వరద ప్రాంతాల్లో మహిళలను బోటు ఎక్కించేందుకు ఓ మత్సకారుడు ఎంత కష్టపడుతున్నాడో వివరిస్తూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టారు. పవన్, లారెన్స్, మురుగదాస్ కంటే ఇతడు చాలా బెటర్ అంటూ ఆమె ఓ వీడియో షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











