శ్రీ రెడ్డి నీతులు : హీరోయిన్స్‌ను స్ఫూర్తిగా తీసుకోవద్దు.. వారి వల్లే మహిళలు చెడిపోతారు!!
క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ టాలీవుడ్‌ను షేక్ చేసింది శ్రీ రెడ్డి. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్దనగ్న ప్రదర్శన, దగ్గుబాటి అభిరామ్‌పై ఆరోపణలు, నాని, పవన్ కళ్యాణ్ వంటి వారిని దూషించడం అప్పట్లో సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆపై మీడియా సహకారం లేకపోవడంతో.. సైలెంట్‌గా చెన్నైకి చెక్కేసి సెటిలైంది. తన పని తాను చేసుకుంటూ ఉన్న శ్రీ రెడ్డి.. గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభించడం ప్రారంభించింది. తాజాగా ఆమె హీరోయిన్లపై, గృహిణీలపై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

అలాంటి వారిని వదిలేయండి..
‘మీకు ఇష్టమైన వారు మీకు ప్రాధాన్యతను ఇవ్వకపోయినా..సమయాన్ని కేటాయించకపోయినా.. అలాంటి వారిని వదిలేయండి.. వారంతా స్వార్థపూరితమైన వారు.. వారు విషంవంటి వారు. వారితోనే ఉంటే ఈ ప్రపంచంలో మీరు మీ గుర్తింపును కోల్పోతార'ని శ్రీరెడ్డి సూక్తులు చెప్పుకొచ్చింది.

హీరోయిన్స్‌ను స్ఫూర్తిగా తీసుకోవద్దు..
సినిమా హీరోయిన్లను ఇన్స్పిరేషన్‌గా తీసుకోవద్దు.. వారంతా ధనికులను, అందమైన వారిని, డబ్బున్నవారిని మాత్రమే చేసుకుంటారు..కానీ సినిమాలను చూపించేందుకు, టిక్కెట్స్ కొనడానికి పేద అబ్బాయిలే అవసరం అంటూ శ్రీ రెడ్డి మరో పోస్ట్ చేసింది.

వారి వల్లే చెడిపోతారు..
హీరోయిన్స్ వల్లే, వారిని స్ఫూర్తి పొంది సాధారణ మహిళలు చెడిపోతున్నారు. ప్రతీ ఒక్కరికీ డబ్బున్న మొగుడే కావాలి.. డబ్బులేని వారు చచ్చిపోతున్నారంటూ శ్రీ రెడ్డి ఫేస్ బుక్‌లో రాసుకొచ్చింది. అయితే సమయం సందర్భం లేకుండా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తుందో మాత్రం తెలియడం లేదు.
Recommended Video

చాలా మందిని చూశాను..
ఈ మధ్య సరైన ప్రవర్తన లేని భార్యలనెంతో మందిని చూశాను. అర్దరాత్రి వరకు మేల్కొని ఉండటం, టిక్ టాక్‌లు చూడటం, వారి గురించి వీరి గురించి చెడుగా మాట్లాడుకోవడం, భర్తను ఇష్టంవచ్చినట్టు తిట్టడం వంటివి చేస్తున్నారంటూ మహిళలపై విరుచుకుపడింది. ఇలాంటి వారు సమాజానికి మంచి పౌరులను అందించలేరని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











