టాలీవుడ్లో శ్రీరెడ్డి రచ్చ మళ్లీ మొదలైంది: రానా-త్రిష, అభిరామ్ ఫోటోలతో..
Recommended Video

వివాదాస్పద తెలుగు నటి శ్రీరెడ్డి మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో రచ్చ మొదలు పెట్టింది. కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వివాదాలపై మౌనంగా ఉంటున్న ఆమె మళ్లీ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా అలజడి మొదలు పెట్టింది. ఇక వరుస ఇంటర్వ్యూల్లో సినీ బిగ్ షాట్స్ రహస్యాలను బయట పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు కుమారుడు.. దగ్గుబాటి అభిరాం తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని, సెక్సువల్‌గా వాడుకున్నాడంటూ గతంలో ఆరోపణలు చేయడం ద్వారా శ్రీరెడ్డి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

దగ్గుబాటి అభిరాం ఇష్యూ
అభిరాం తనతో చాలా కాలం ఎఫైర్ మెయింటేన్ చేశాడని రుజువు చేస్తూ కొన్ని ప్రైవేట్ ఫోటోలను కూడా అప్పట్లో శ్రీరెడ్డి బయట పెట్టారు. ఈ వ్యవహారంపై సురేష్ బాబు, ఫ్యామిలీ మౌనంగానే ఉంటూ వచ్చింది. అభిరాం తప్పు చేస్తే అందుకు తగిన ఫలితం అనుభవిస్తాడు అంటూ దీన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు.

ప్రముఖులపై ఆరోపణలు
ఆ తర్వాత పలువురు తెలుగు సినీ ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి ఆరోపణల వర్షం కురిపించారు. అప్పట్లో శ్రీరెడ్డి వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు శ్రీరెడ్డికి ప్రతి కూలంగా మారడంతో ఆమె చెన్పై ఇండస్ట్రీకి మకాం మార్చారు.

సురేష్ బాబు గురించి మళ్లీ...
తాజాగా శ్రీరెడ్డి హైదరాబాద్ వచ్చారు. నిర్మాత సురేష్ బాబు గురించి సంచలన ట్వీట్ చేశారు. ఫ్యామిలీ, పరువు, వ్యక్తిగతం, బుద్ది, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబుగారు పిల్లలను పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదులుతారా? అంటూ మళ్లీ ఆరోపణల పర్వం మొదలు పెట్టారు.

రానా-త్రిష.. అభిరాం-శ్రీరెడ్డి ఫోటోతో
అభిరామ్‌తో ఇంటిమేట్‌గా ఉన్న ఫోటోతో పాటు... రానా-త్రిష కలిసి ఉన్న పాత ఫోటోను శ్రీరెడ్డి మళ్లీ ఫోటో షేర్ చేశారు. వీరిద్దరు తాతని మించి పోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వీరి సరసాలకు రామానాయుడు స్టూడియోనే అడ్డా అంటూ ఆరోపించారు. చూస్తుంటే శ్రీరెడ్డి మళ్లీ ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











