నిహారిక పెళ్లిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు: అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే అంటూ ఘాటుగా!

నటిగా కొన్ని సినిమాల్లో కనిపించినా గుర్తింపును దక్కించుకోలేకపోయింది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. కానీ, కాస్టింగ్ కౌచ్ వివాదంతో మాత్రం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. నగ్నంగా నిరసన చేసి మరింత హాట్ టాపిక్ అయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే... సినీ పరిశ్రమలోని కొందరిని టార్గెట్ చేయడం ద్వారా ఆమె చాలా మందికి శత్రువులా మారింది. తరచూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోన్న శ్రీరెడ్డి.. తాజాగా నిహారిక పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆ వివరాలు మీకోసం!

ఉద్యమంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు

ఉద్యమంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కావాలంటే దర్శక నిర్మాతల దగ్గర లొంగిపోవాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయింది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ వల్ల తనలా ఎంతో మంది ఇబ్బందులను ఎదుర్కొన్నారని, దాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో అప్పట్లో పెద్ద ఉద్యమాన్నే మొదలు పెట్టింది. దీనికి మహిళా సంఘాల నుంచి కూడా భారీ స్థాయిలో మద్దతు వచ్చింది.

 సినీ ప్రముఖులను టార్గెట్ చేయడంతో

సినీ ప్రముఖులను టార్గెట్ చేయడంతో

కాస్టింగ్ కౌచ్ నిర్మూలన చేయడంతో పాటు తనలా నష్టపోయిన అమ్మాయిలకు న్యాయం చేయాలని శ్రీరెడ్డి చాలా రోజుల పాటు పోరాటం చేసింది. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులపైనా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఫొటోలను కూడా లీక్ చేసింది. ఆ సమయంలో కొందరు పెద్దలను టార్గెట్ చేయడంతో ఆమె మరింత పాపులర్ అయిపోయింది.

సోషల్ మీడియాను అలా వాడుకుని

సోషల్ మీడియాను అలా వాడుకుని

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం మొదలవక ముందే ఆమెకు ఫేస్‌బుక్‌లో యాభై లక్షల మందికి పైగానే ఫాలోవర్లు ఉన్నారు. అంతలా ఫేమస్ అయిందామె. ఇక, దీన్ని వాడుకుని తరచూ కొందరు హీరోలు, హీరోయిన్లను టార్గెట్ చేసి పోస్టులు పెడుతుంది శ్రీరెడ్డి. అంతేకాదు, డైరెక్టుగా వాళ్ల పేర్లను కూడా అందులో రాసుకొస్తుంది.

 నిహారిక పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు

నిహారిక పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు

మొదటి నుంచీ మెగా ఫ్యామిలీ అంటే అంతెత్తున లేస్తుంది శ్రీరెడ్డి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, నాగబాబు, చిరంజీవిలను దారుణంగా ట్రోల్ చేస్తుంది. వాళ్ల సినీ కెరీర్‌తో పాటు రాజకీయాల గురించి కూడా రాయడానికి వీలులేని భాషను ఉపయోగిస్తూ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన నిహారిక పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. దీంతో మరోసారి వార్తల్లోకెక్కింది.

పవన్, నాగబాబు పేర్లు తీసి అలాంటి

నిహారిక పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్ ప్యాలెస్‌లో జరిగింది. నాలుగు రోజులుగా ఇది బాగా హైలైట్ అవుతోంది. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి.. ‘ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి లాగ.. నాగబాబు కూతురి పెళ్లికి మీరంతా ఎందుకు పిసుక్కుంటున్నార్రా. యూట్యూబ్ ఓపెన్‌ చేస్తే చాలు పవన్ వచ్చాడు.. డ్యాన్స్ చేశారు ఇవే కనిపిస్తున్నాయి' అంటూ కామెంట్లు చేసింది.

Recommended Video

Bombhaat Director About Chandini Chowdary | Bombhaat Team Interview Part 4
 ఆమె ఆత్మహత్య చేసుకుంటే అంటూ

ఆమె ఆత్మహత్య చేసుకుంటే అంటూ

దీనిని కంటిన్యూ చేస్తూ.. ‘మీడియా కూడా నిహారిక పెళ్లిని అంతలా హైలైట్ చేయకూడదు. రైతులు రోడ్ల మీదకు వస్తున్నారు. తమిళనాడులో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పాపం అలాంటివి ఫోకస్ చేయండి. ఇకనైనా మారండిరా బాబు. పనికిరాని వెదవల్లారా. నేనన్నది మీడియాను కాదు.. పెళ్లిళ్లను చూసి పిసికేసుకుంటున్న వారిని' అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X