ఆత్మహత్య చేసుకొంటా.. నన్ను వేశ్య అంటారా? .. శ్రీరెడ్డి బెదిరింపు
Recommended Video

తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి సృష్టించిన కలకలం అంతర్జాతీయ పత్రికల దృష్టిని కూడా ఆకర్షించింది. శేఖర్ కమ్ముల, నాని, అభిరామ్ దగ్గుబాటి లాంటి వ్యక్తులపై సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కలకలం తమిళ సినిమా పరిశ్రమకు చేరింది. ఏఆర్ మురగదాస్, శ్రీకాంత్, రాఘవ లారెన్స్, సుందర్ సీ లాంటి సినీ ప్రముఖలపై సోషల్ మీడియాలో తీవ్రమైన మాటల దాడి చేసింది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ కేసు నమోదు చేయడం ఆమెకు ఇబ్బందిగా మారింది. వివరాల్లోకి వెళితే..

శ్రీరెడ్డికి చేదు అనుభవం
చెన్నైలో శ్రీరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై నటుడు, సామాజిక కార్యకర్త వరాహి ఆమెపై కేసు నమోదు చేశారు. సినీ నటులను, డైరెక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమెను వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

న్యాయం జరుగకపోతే ఆత్మహత్యనే
వరాహి దాఖలు చేసిన కేసుపై మలయాళ టెలివిజన్ ఛానెల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. నాకు అన్యాయం జరిగింది. నాకు న్యాయం జరగకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడటానికి సిద్ధమే అని శ్రీరెడ్డి అన్నట్టు కథనంలో పేర్కొన్నది.

నన్ను వేశ్య అని
టెలివిజన్ ఇంటర్వ్యూ సందర్బంగా శ్రీరెడ్డి భావోద్వేగానికి గురైంది. నేను బాధితురాలిని. నాకు న్యాయం జరుగడం లేదు. నన్ను వేశ్య అని పిలుస్తున్నారు. అలాంటి మాట అంటే ఎంత బాధ కలుగుతుందో మీకు తెలియదు. నా కుటుంబం ఎలాంటి బాధకు గురవుతుందో తెలుసా? ఇలాంటి వింటున్నప్పుడు నాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది అని శ్రీరెడ్డి అన్నారు.

నాలాగా ఇంకా చాలా మంది
సమాజంలో నేను ఒంటరి మహిళను. ఒంటరిగానే పోరాటం చేస్తున్నాను. నాకు న్యాయం జరగాలి. ఇంకా చాలా మంది అమ్మాయిలు నాలానే నష్టపోయారు. మలయాళంలో ఓ హీరోయిన్ దాడికి గురైతే అందరూ స్పందించి మద్దతు తెలిపారు. నాకు అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రావడం లేదు.


Click it and Unblock the Notifications











