టాలీవుడ్ సెక్స్ రాకెట్ ఇంటరాగేషన్.. యూఎస్ పోలీసులకు అంతా చెప్పేశా, ఫోటోలు లీక్.. శ్రీరెడ్డి!
Recommended Video

చికాగో సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికాకు వెళ్లిన టాలీవుడ్ సెలెబ్రిటీలు అంటూ చాంతాండంత లిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా ఫోటోలు లీక్ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో చాలా మంది నటీమణులు బాధితులుగా ఉన్నారని పేర్కొంది. కొన్ని నెలలుగా ఇలాంటి విషయాలపై తాను పోరాటం చేస్తుంటే మిగిలిన హీరోయిన్స్ అంతా మాకుమాత్రం ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోయారని శ్రీరెడ్డి విమర్శించింది. అమెరికాలో జరుగుతున్న సెక్స్ రాకెట్ ఇంటరాగేషన్ గురించి శ్రీరెడ్డి సంచలన విషయాలు వెల్లడించింది.

డబ్బు బాగా దండుకున్నారు
సెక్స్ రాకెట్ విషయంలో ఓ సాధారణ మహిళగా తాను పోరాటం చేశానని శ్రీరెడ్డి తెలిపింది. ఈ పోరాటంలో అర్థనగ్న నిరసన కూడా చేసానని శ్రీరెడ్డి గుర్తు చేసుకుంది. ప్రతి న్యూస్ ఛానెల్ కు తిరిగి పైసా కూడా ఆశించకుండా ఇంటర్వ్యూలు ఇచ్చానని శ్రీరెడ్డి తెలిపింది. కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం తన ద్వారా బాగా డబ్బులు సంపాదించాయని శ్రీరెడ్డి బయట విశేషం.

టీఆర్పీ రేటింగులు కోసమే
కొన్ని మీడియా సంస్థలు టిఆర్పి రేటింగులు కోసమే తనని ఉపయోగించుకున్నారని శ్రీరెడ్డే ఓ వీడియోలో వెల్లడించింది. సదరు మీడియా సంస్థలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే.

పోలీసులకు మొత్తం
అమెరికా పోలీసులకు ఇంటరాగేషన్ లో తాను రెండు నెలల నుంచి సహకరిస్తున్నాని శ్రీరెడ్డి తెలిపింది. యుఎస్ పోలీసులకు అన్ని విషయాలు వెల్లడించానని శ్రీరెడ్డి తెలిపింది.

ఇంటరాగేషన్ లో నేనే ప్రధానం
అమెరికా పోలీసులతో తాను టచ్ లో ఉంటూ ఈ వ్యభిచారం ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాలు వెల్లడించినట్లు శ్రీరెడ్డి తెలిపింది. కిషన్, చంద్ర దంపతులు హీరోయిన్స్ ని ఎలా బుక్ చేస్తారు వంటి విషయాలు వారికీ తెలిపానని పేర్కొంది. యుఎస్ పోలీసులు చేస్తున్న ఇంటరాగేషన్ లో కీలకంగామారింది తానే అని శ్రీరెడ్డి వెల్లడించింది.

ఏ సంస్థకు వ్యతిరేకం కాదు
అమెరికాలో ఉన్న ఏ తెలుగు సంస్థకు నేను వ్యతిరేకం కాదు అని శ్రీరెడ్డి పేర్కొంది. కిషన్ నడిపిస్తున్న వ్యభిచారం గురించి మాత్రమే చెప్పానని శ్రీరెడ్డి పేర్కొంది.

మీడియా సంస్థలకు డబ్బులు ఇచ్చి
అదే వీడియోలో శ్రీరెడ్డి బిగ్ బాస్ 2 గురించి కూడా కామెంట్ చేసింది. బిగ్ బాస్ 2 అనుకున్న విధంగా రేటింగ్స్ రాకపోవడంతో స్పాన్సర్స్ మీడియా సంస్థలకు డబ్బులు ఇచ్చి మరీ పబ్లిసిటి చేసుకుంటున్నారని శ్రీరెడ్డి తెలిపింది.

ఫోటోలు లీక్
అదే సమయంలో తన పేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి కొందరు టాలీవుడ్ సెలెబ్రిటీల ఫోటోలు కూడా లీక్ చేసింది. చికాగో సెక్స్ టికెట్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో శ్రీరెడ్డి లీక్ చేస్తున్న ఫొటోలు సంచలనంగా మారాయి.

హీరోయిన్ల పేర్లు కూడా
ఇటీవల శ్రీరెడ్డి యుఎస్ వెళ్లిన పలువురు హీరోయిన్ల పేరు కూడా ప్రస్తావించింది. శ్రీరెడ్డి వెల్లడించిన పేర్లలో స్టార్ హీరోయిన్స్, సింగర్స్, యాంకర్స్ కూడా ఉండడం విశేషం.


Click it and Unblock the Notifications











