»   » వర్మ వద్ద అందరి జాతకాలు... శ్రీరెడ్డికి సపోర్ట్ ఇస్తుండటంతో గుబులు!

వర్మ వద్ద అందరి జాతకాలు... శ్రీరెడ్డికి సపోర్ట్ ఇస్తుండటంతో గుబులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేస్తున్న శ్రీరెడ్డికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తన సపోర్టు ఇస్తూనే ఉన్నారు. మొన్న ఆమెను ఝాన్సీ రాణి లక్ష్మీబాయితో పోల్చిన వర్మ తాజాగా అశోక చక్రవర్తితో కంపేర్ చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. శ్రీరెడ్డికి వర్మ ఇలా తన మద్దతు ప్రకటిస్తుండటంతో హీరోయిన్లను కాస్టింగ్ కౌచ్ ముసుగులో వాడుకున్న కొందరు సినిమా పెద్దల్లో గుబులు మొదలైందట. అసలే వర్మ తిక్కలోడు... ట్విట్టర్ లేదా ఫేస్ బుక్‌లో వారి గురించి చిన్న క్లూ ఇచ్చినా చాలు క్షణాల్లో అది వైరల్ అవుతుంది. దీంతో ఆయన్ను ఈ విషయంలో కదిలించడానికి కూడా చాలా మంది భయపడుతున్నారట.

Murali Mohan Sensational Comments On Sri Reddy
వర్మ వద్ద చాలా మంది జాతకాలు!

వర్మ వద్ద చాలా మంది జాతకాలు!

వర్మ వద్ద కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడిన చాలా మంది జాతకాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద నిర్మాత హీరోయిన్ల పట్ల ఎలా ప్రవర్తించాడో అతడి పేరు బయటకు చెప్పకుండా వెల్లడించాడు ఈ వివాదాస్పద డైరెక్టర్. శ్రీరెడ్డిని ఎవరైనా ఏమైనా అంటే వారికి తగిన రీతిలో సమాధానం ఇస్తున్నారు. గతంలో కొన్నిచెత్త పనులు చేయడంతో పాటు అభ్యంతరకమైన లాంగ్వేజ్ మాట్లాడిన శ్రీరెడ్డి... ఇపుడు సోషల్ యాక్టివిస్ట్‌గా తనను తాను ప్రజెక్ట్ చేసుకోవడం ఏమిటీ అంటూ విమర్శిస్తున్న వారికి వర్మ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

శ్రీరెడ్డి పూర్తిగా మారింది

అశోక చక్రవర్తి కూడా ఒకప్పుడు వరుస యుద్ధాలు చేసి ఎంతో మందిని చంపారు. ఆ తర్వాత ఆయన మనసు పూర్తిగా మారిపోయింది. లక్షలాది తన ప్రజలను ఎంతో బాగా పరిపాలించాడు. శాంతి మార్గంలో నడిచారు. శ్రీరెడ్డి కూడా ఇపుడు పూర్తిగా మారిపోయింది. అశోక చక్రవర్తిలో ఎలా మార్పు వచ్చిందో.... శ్రీరెడ్డిలో కూడా ఇపుడు పూర్తిగా మారిపోయింది అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

ఆమెను చూసి భయపడుతున్నారు

శ్రీరెడ్డి నిజాయితీని చూసి చాలా మంది పురుషులు భయపడుతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మహిళలంతా ఆమెపై ఈర్షతోనే అలా మాట్లాడుతున్నారు.... అంటూ వర్మ తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.

మీరంతా శ్రీస్త్రీ శక్తిని ఫాలో అవ్వాలి

నిజాయితీగల, సిన్సియర్‌గా ఉండే మహిళలు కేవలం శ్రీస్త్రీ శక్తిని ఫాలో అవ్వాలి అని వర్మ ట్వీట్ చేశారు. శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్ యాక్టివిస్టుగా మారడంతో పాటు తన పేరు శ్రీ స్త్రీ శక్తిగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

English summary
Filmmaker Ram Gopal Varma continues to go gaga over actress Sri Reddy's victory in her fight against sexual exploitation in the Telugu film industry and says that she is as great as Ashoka the Great, an Indian emperor of the Maurya Dynasty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X