కంగనాపై నోరు పారేసుకున్న శ్రీరెడ్డి.. మొత్తానికి అందరిలోనూ అలా బుక్కైంది!
శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో చేసే కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో చెప్పడం కష్టం. అయితే ఈ సారి మాత్రం బాలీవుడ్ వివాదాల మీద పడింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ను నోటికొచ్చినట్టు తిట్టింది. అయితే శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలు శ్రీరెడ్డి కంగనాను ఎందుకు టార్గెట్ చేసింది?ఏం జరిగింది? ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

సుశాంత్ కేసులో యాక్టివ్..
సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుంచి కంగనా రనౌత్ ప్రతీ విషయంలోనూ ముందు ఉంటోంది. మొదట్లో నెపోటిజంపై టార్గెట్ చేస్తూ బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఆ తరువాత డ్రగ్స్ మాఫియా గుట్టు బయట పెడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇక రీసెంట్‌గా శివసేన మంత్రి సంజయ్ రౌత్‌తో ఢీ కొడుతోంది.

మాటల యుద్దం..
తనకు ముంబై పోలీసుల మీద నమ్మకం లేదంటూ కంగనా చేసిన కామెంట్లపై సంజయ్ రౌత్ ఫైర్ అయ్యాడు. అలాంటప్పుడు ముంబైలో అడుగుపెట్టకు, పెడితో రాళ్లతో కొట్టి చంపుతాం అంటూ సంజయ్ రౌత్ బహిరంగంగా బెదిరించాడు. ఇలాంటి బెదిరింపులకు బయపడని కంగనా.. ఏం చేస్తారో చేసుకోండి ముంబైలో అడుగుపెడతాను, అదేమైనా పాక్ ఆక్రమిత కాశ్మీరా? అంటూ ఫైర్ అయింది.

మధ్యలో శ్రీ రెడ్డి ఎంట్రీ..
ఓ వైపు వారిద్దరి మధ్య మాటల పోరు జరుగుతూ ఉంటే..శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చింది. కంగనాకు తల పొగరు ఎక్కువ, ఆమె వరెస్ట్.. మహారాష్ట్ర ద్వారానే క్రేజ్,కోట్లు , అభిమానుల ప్రేమను సంపాదించుకుంది.. ఐ లవ్ ముంబై అంటూ కంగనాపై నోరుపారేసుకుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె చేసిన ఈ పోస్ట్‌కు అన్నీ నెగెటివ్ కామెంట్సే వస్తున్నాయి.

తెలియకపోతే నోర్మూసుకో..
కంగనాతో నీకు పోలిక ఏంటి.. నీకంటే వంద రెట్లు గొప్పది, నీకు తెలిసింది శూన్యం. ఇన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడు వచ్చి కంగనాను అంటావా? అంటూ నెటిజన్లు శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. తామంతా కంగనాకు మద్దతు తెలుపుతున్నామని ముక్తకంఠంగా కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











