‘ఆచార్య’ కథను లీక్ చేసిన శ్రీరెడ్డి: చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు.. జూనియర్ ఎన్టీఆర్‌నూ వదల్లేదుగా!
కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో పాపులర్ అయి.. సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తూ.. గ్లామర్ షోతో తరచూ వార్తల్లో నిలుస్తోంది తెలుగు బ్యూటీ శ్రీరెడ్డి. కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియా వేదికగా ఎంతో మందిని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తన వివాదాస్పద తీరుతో నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' కథను లీక్ చేసిందీ అమ్మడు. అంతేకాదు, ఆయనను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను వదల్లేదు. ఆ వివరాలు మీకోసం!

నగ్న నిరసనతో దేశ వ్యాప్తంగా గుర్తింపు
తెలుగులో పలు సినిమాల్లో నటించినా శ్రీరెడ్డికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ, టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని చేసిన ఆరోపణలతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. ఇలా చాలా రోజుల పాటు వార్తా డిబెట్లలో పాల్గొని విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ ముందు నగ్నంగా నిరసన చేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది శ్రీరెడ్డి.

సినీ ప్రముఖులే కాదు.. నాయకులనూ
మొదట్లో వార్తా ఛానెళ్ల ద్వారా చాలా మందిపై విమర్శలు, ఆరోపణలు చేస్తుండేది శ్రీరెడ్డి. కొంత కాలానికి ఆమెను ఎవరూ పట్టించుకోవడమే మానేశారు. దీంతో సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాలా మందిని టార్గెట్ చేసింది. ఇందులో భాగంగానే పలువురు సినీ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అలాగే, రాజకీయ నాయకులనూ విమర్శించింది.

గ్లామర్ షో... బూతులతో రెచ్చిపోతోంది
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి.. చాలా కాలంగా అందులో నుంచే తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బూతులతోనూ రెచ్చిపోతోంది. అంతేకాదు, చాలా మందిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేస్తోంది. కొన్ని వీడియోలనూ వదులుతోంది.

టీజర్‌పై స్పందన.. చిరంజీవిపై కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరెడ్డి ఈ వీడియోపై స్పందించింది. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఈ టీజర్‌పై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఈ సమయంలోనే హీరో చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచిందీ బ్యూటీ.

ఎన్టీఆర్‌ను వాడుతూ చిరుపై విమర్శలు
'ఆచార్య' టీజర్ చూసిన తర్వాత దాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన శ్రీరెడ్డి.. నందమూరి హీరో ఎన్టీఆర్‌ను వాడుతూ మెగాస్టార్ చిరంజీవిపై విమర్శలు చేసింది. 'అబ్బే.. ఎంతైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటన ముందు చిరంజీవి కూడా సరిపోడు. ఆచార్య ట్రైలర్‌లో డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు' అని అందులో పేర్కొంది. శ్రీరెడ్డి చేసిన ఈ పోస్టుపై మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

‘ఆచార్య’ సినిమా కథను లీక్ చేసిన శ్రీరెడ్డి
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'ఆచార్య'. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో పలు రికార్డులు బద్దలైపోతున్నాయి. ఈ నేపథ్యం హాట్ బ్యూటీ శ్రీరెడ్డి తన ట్విట్టర్‌లో 'ఆచార్య కథ నాకు తెలిసిపోయింది. చిరంజీవి ఎక్కడి నుండో ఒక ఊరికి వస్తాడు. అక్కడి వాళ్ళ కష్టాలు తీరుస్తాడు అంతే' అంటూ ఓ పోస్టు పెట్టింది.


Click it and Unblock the Notifications











