వారు నన్ను చంపేస్తారు, వీరి నుండైనా కాపాడండి సర్: కేసీఆర్‌కు శ్రీరెడ్డి విన్నపం

By Bojja Kumar

Recommended Video

Sri Reddy Requests KCR To Give Security

కాస్టింగ్ కౌచ్, సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న శ్రీరెడ్డి.... పలువురు తెలుగు సినిమా స్టార్లు, దర్శకులు, నిర్మాతలు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారంటూ, అందులో తానూ ఉన్నానంటూ సంచలన విషయాలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ సినీ స్టార్లపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. తాజాగా శ్రీరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రిక్వెస్ట్ చేస్తూ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ చర్చనీయాంశం అయింది.

రాజకీయ నాయకులు కూడా ఉన్నారు

రాజకీయ నాయకులు కూడా ఉన్నారు

‘గౌరవనీయులైన సీఎం కేసీఆర్ సర్. ఇప్పటికైనా స్పందించండి. ఎన్నిరోజులు మేము ఈ బాధలు పడాలి. డ్రగ్స్ అలవాటు, హీరోయిన్స్‌తో పడుకునే వారిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు' అని శ్రీరెడ్డి తెలిపారు.

అలా చేస్తే నన్ను చంపేస్తారేమో? అందుకే మాట్లాడను

అలా చేస్తే నన్ను చంపేస్తారేమో? అందుకే మాట్లాడను

పొలిటికల్ తేనెతుట్టెను నేను టచ్ చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే వారి గురించి మాట్లాడటం ద్వారా నాకు న్యాయం జరుగదని తెలుసు. ఒక వేళ మాట్లాడితే నన్ను చంపేస్తారు. అందుకే వారి జోలికి పోదలుచుకోలేదు. అలాంటి వారిలో మీకు సన్నిహితులైన వారు కూడా ఉన్నారు సార్. అందుకే నేను ఆ పొలికల్ సైడ్ రావాలనుకోవడం లేదు, నోరు మూసుకుని ఉంటాను'

వారు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు

వారు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు

‘సినిమా ఇండస్ట్రీలో అయినా మా సమస్యను దయచేసి పట్టించుకోండి సార్. ‘మా' అసోషియేషన్, ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మీరు తండ్రి లాంటి వారు, తెలంగాణ రాష్ట్రానికి కింగ్. మా పరిస్థితి దారుణంగా ఉంది. మీరు అర్థం చేసుకుని.. సమస్యని పరిష్కరించండి'

నిజాలు మాట్లాడుతున్నా, బహిష్కరించొద్దు సార్

నిజాలు మాట్లాడుతున్నా, బహిష్కరించొద్దు సార్

కేసీఆర్ సర్... సినీ ఇండస్ట్రీలోని పెద్ద తలకాలయల నుండి మా లాంటి వారిని కాపాడతారని కోరుకుంటున్నాను. నేను నిజాలు మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుండి దయచేసి నన్ను బహిష్కరించొద్దు శ్రీరెడ్డి విన్నవించారు. మిమ్మల్ని కలవడం నా వల్ల కావడం లేదని, అందుకే సోషల్ మీడియా ద్వారా అయినా ఈ విషయం మీకు చేరాలని ఈ పోస్టు చేస్తున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X