నువ్వెలాంటి దానివో నాకు ఈరోజు తెలిసింది.. స్టార్ హీరోయిన్‌పై మండిపడ్డ శ్రీరెడ్డి!

మీడియా సంచలనం నటి శ్రీరెడ్డి విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిత్యం వివాదాస్పదంగా మారుతున్నాయి. పేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లోని తన అకౌంట్స్ లో శ్రీరెడ్డి తన అభిప్రాయాలు తెలియజేస్తూ బూతు పదజాలంతో రెచ్చిపోతోంది. తాజాగా శ్రీరెడ్డి స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ పై సంచలనం వ్యాఖ్యలు చేసింది. ఆమె తన ఇన్సిపిరేషన్ అంటూనే ఘాటైన విమర్శలు చేసింది.

 చాలా సార్లు చెప్పా

చాలా సార్లు చెప్పా

శ్రీరెడ్డి తన పేస్ బుక్ పేజీలో.. చాలా సార్లు చెప్పా. నేను ఆదర్శంగా భావించే నటీమణుల్లో కంగనా రనౌత్ ఒకరు. కంగనా రనౌత్ కూడా అనేక వివాదాలు. ఇబ్బందులని అధికమించి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ రోజు తాను కంగనా రనౌత్ గురించి కొన్ని నిజాలు తెలుసుకున్నానని శ్రీరెడ్డి కామెంట్ చేసింది.

 ఆ పాత్రకు నీవు అన్‌ఫిట్

ఆ పాత్రకు నీవు అన్‌ఫిట్

కంగనా రనౌత్ చాలా చెడు ప్రవర్తన కలిగిన నటి. నువ్వు మేడం జయలలిత పాత్రలో నటించేందుకు అర్హురాలివి కాదు. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయలలిత పాత్ర కోసం కంగనారనౌత్ ని ఎంపిక చేసుకున్నారు. కంగనా కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కానీ కంగనా రనౌత్ జయపాత్రలో నటించకూడదని శ్రీరెడ్డి అంటోంది.

 సౌత్ ఇండస్ట్రీ గురించి

సౌత్ ఇండస్ట్రీ గురించి

కంగనా రనౌత్ దక్షణాది చిత్ర పరిశ్రమ గురించి చాలా చెడుగా మాట్లాడడం విన్నా. ముందు ఆ చెత్త వాగుడు ఆపు. తెలుగు, తమిళ, మలయాళీ ప్రజలు ఇక్కడి చిత్రాలనే ఆదరిస్తారు. ఇందులో నీకేంటి సమస్య. నీ మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ కూడా తెలుగువాడే. ఆ విషయాన్ని గుర్తుంచుకో.. మాటలు జాగ్రత్తగా రానీ అంటూ శ్రీరెడ్డి కంగనా రనౌత్ పై విరుచుకుపడింది.

కంగనా వ్యాఖ్యలు

కంగనా వ్యాఖ్యలు

జయలలిత బయోపిక్ గురించి కంగనా రనౌత్ మాట్లాడుతూ.. దక్షణాది చిత్రాల్లో నటించడానికి నేను ఎప్పుడూ సిద్దమే. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నేను ఓ విషయాన్ని గమనించా. ఇక్కడి ప్రజలు కేవలం లోకల్ చిత్రాలని మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు దేశంలోని మిగిలిన భాగంతో అంతగా కనెక్ట్ అయి ఉండరని కంగనా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలని శ్రీరెడ్డి తప్పుబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X