పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి ఫైర్.. సమంత, తమన్నానే కావాలా?.. మీ ఫ్యాన్స్ దాడి చేసినా భయపడను..

By Rajababu

Recommended Video

అందరికీ సమంత, తమన్నానే కావాలా? : పవన్ కల్యాణ్‌ కి శ్రీరెడ్డి వార్నింగ్

న్యూస్ యాంకర్, నటి శ్రీరెడ్డి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు సంచలనం రేపుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని సంధించిన మాటలు మీడియా వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగు అమ్మాయిలను పట్టించుకోవడం లేదు. తెలుగు సాంకేతిక నిపుణులకు సినీ వర్గాల నుంచి ఆదరణ లభించడం లేదని ఆమె అన్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌పై కూడా విమర్శనాస్త్రాలను సంధించారు. ఆమె ఏమన్నారంటే..

తెలుగు అమ్మాయిలను పట్టించుకోరా?

తెలుగు అమ్మాయిలను పట్టించుకోరా?

శ్రీరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్నా తెలుగు అమ్మాయిలను సినీ దర్శక, నిర్మాతలు పట్టించుకోవడం లేదు. పక్కలో వాడుకోని వదిలేస్తున్నారు. శారీరకంగా వాడుకొన్న తర్వాత కూడా వేషాలు లేవని చెప్పిన వాళ్లు ఉన్నారు అని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు ఉపన్యాసాలు ఇస్తారు..

తెలుగు ఉపన్యాసాలు ఇస్తారు..

ఇంటర్యూలో భాగంగా శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గారు.. మీరు తెలుగు గురించి బోలెడన్నీ ఉపన్యాసాలు ఇస్తారు. తెలుగు పుస్తకాలు చదువుతాను అని చెబుతారు. మీరు సహాయం చేస్తానని చెప్పుకొంటారు. మీరు ఎందుకు తెలుగు హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకోరు అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

తెలుగు వారికి ఆఫర్లు ఇవ్వండి

తెలుగు వారికి ఆఫర్లు ఇవ్వండి

మీకు తెలుగు మీద అంత ప్రేమ ఉంటే.. నలుగురు తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని అనిపించదా. మీకు తెలుగు మీద నిజంగా మనసుంటే.. తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వండి. విలన్లను తెలుగు వారిని ప్రోత్సాహించండి. సాంకేతిక నిపుణులకు అవకాశం ఇవ్వండి అని ఆమె అన్నారు.

అప్పుడే మేము నమ్ముతాం..

అప్పుడే మేము నమ్ముతాం..

ఒకవేళ మీరు తెలుగు కళాకారులకు అవకాశం ఇస్తే మీకు తెలుగు మీద ప్రేమ ఉందని నమ్ముతాం. మీరు రాజకీయవేత్తగా ఎదుగాలని కోరుకొంటున్నాను. మిమ్మల్ని ప్రశ్నించినందుకు కత్తి మహేష్ మీద దాడి చేసిన విధంగా మీ ఫ్యాన్స్ నాపై దాడి చేసినా గానీ నేను భయపడను అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

మీరంటే ఇష్టం.. కానీ

మీరంటే ఇష్టం.. కానీ

నాకు జరిగిన అన్యాయానికి బాధపడే నేను నోరు విప్పుతున్నాను. పవన్ కల్యాణ్ అంటూ మీ ఫ్యాన్స్ పిచ్చిగా ఆరాధిస్తారు. నేను కూడా మీ యాక్టింగ్‌ను ఇష్టపడుతాను. నేను మిమ్మల్ని వ్యక్తిగతం టార్గెట్ చేయడం లేదు అని ఆమె తెలిపారు.

మీరు తెలుగు అమ్మాయిలను

మీరు తెలుగు అమ్మాయిలను

పవన్ కల్యాణ్ గారు.. మీరు తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయండి. ప్రణీత, మిగితా వారిని తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. అల్రేడి పేరున్న హీరోలకు పాపులర్ హీరోయిన్లు అవసరమా? మీ సినిమాలే ప్రమోట్ చేసుకోవడానికి పాపులర్ హీరోయిన్లు కావాలా? శ్రీరెడ్డి ప్రశ్నించారు.

సమంతనే కావాలా..

సమంతనే కావాలా..

మీ సినిమాల్లో నటించడానికి సమంతనే కావాలా.. అందరికీ ఇలియానానే కావాలా? తమన్నానే కావాలా? ఇప్పుడు చాలా మంది వారికి ధీటుగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. మీరు వాళ్లను పట్టించుకోవాలి అని సినీ ప్రముఖులను కోరారు.

నేను ఉద్యమం చేపడుతా..

నేను ఉద్యమం చేపడుతా..

తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఎందుకు రావని నేను ఉద్యమం చేపడుతా. చాలా మంది తెలుగు అమ్మాయిల కోసం పోరాటం చేస్తాను. మీరు కూడా ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నారు. మీరు నిజంగా తెలుగువారిపై ప్రేమ ఉంటే స్థానికులకు అవకాశాలు ఇవ్వండి.

మీ కాళ్లకు మొక్కుతా

మీ కాళ్లకు మొక్కుతా

మీకు మనస్సాక్షి ఉంటే మీరు తెలుగు అమ్మాయిలకు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులకు తోడ్పాటునందిస్తే మీ కాళ్లకు మొక్కుతాను. నా ఆవేదన మీకు చేరేలా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అని శ్రీరెడ్డి కోరింది.

మీరు పెద్దమనుషులు కాలేరు

మీరు పెద్దమనుషులు కాలేరు

సినిమా పరిశ్రమలో నలుగురు బౌన్సర్లు వెనుకేసుకుని తిరిగితే పెద్ద మనుషులు కాలేరు. మీరు ఎలాగైతే కష్టపడి పైకి వచ్చారో.. అలాగే నలుగురు కష్టపడేవారికి సహాయం చేయాలి. మీరు కష్టపడ్డ క్షణాలను మీరు గుర్తు తెచ్చుకోవాలి.

సంచలనంగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు

సంచలనంగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు

వర్థమాన నటి శ్రీరెడ్డి మీడియాలో ఇస్తున్న ఇంటర్వూలు సంచలనంగా మారాయి. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. శ్రీరెడ్డి ఇంటర్వ్యూ వీడియోలు ఇంటర్నెట్‌, సోషల్ మీడియా, యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X