నువ్ మగాడివిరా బుజ్జీ.. నీ పెళ్ళాంగా ఆ ఒక్క రోజైనా.. శ్రీ రెడ్డి మరో సంచలనం

Recommended Video

Sri Reddy Comments On Byreddy Siddharth Reddy | బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి శ్రీరెడ్డి లవ్ ప్రపోసల్

కాస్టింగ్ కౌచ్ పేరిట సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు పరిష్కారం చేపట్టాలని ఉద్యమించిన శ్రీ రెడ్డి.. మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించి సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కామెంట్ల రూపంలో తన అస్త్రాలను సంధిస్తోంది. అయితే ఆమె పెడుతున్న ఈ కామెంట్లలో బూతు పురాణం ఎక్కువగా ఉండటంతో అవి వెంటనే వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఓ యువనేతపై ఆమె చేసిన కామెంట్ చేయడం సెన్సేషన్‌గా మారింది.

ప్రత్యేకంగా వ్యక్తులను గురి.. చర్చనీయాంశం

ప్రత్యేకంగా వ్యక్తులను గురి.. చర్చనీయాంశం

ఫేస్‌బుక్ వేదికగా హద్దులు దాటి కామెంట్లు చేస్తున్న శ్రీ రెడ్డి సినీ, రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తులను ఎంచుకొని మరీ టార్గెట్ చేస్తోంది. గతంలో తేజ, ఇలియానా, బోయపాటి శ్రీను లాంటి బడా సినీ ప్రముఖల పేర్లు వాడేసిన ఈమె.. తాజాగా వైఎస్సార్ సీపీ యువనేతపై మనసు పడటం చర్చనీయాంశంగా మారింది.

వరుస పోస్టులు.. పెళ్లి గురించి ప్రస్తావన

వరుస పోస్టులు.. పెళ్లి గురించి ప్రస్తావన

బూతులు మాట్లాడటం, రెచ్చగొట్టే కామెంట్లు చేయడం ద్వారా బాగానే పాపులర్ అయిన శ్రీ రెడ్డి.. ఇప్పుడు పెళ్లి గురించి ప్రస్తావన తేవడం, పైగా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును వాడేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ యువ నాయకుడిపై మనసు పారేసుకున్నానని పేర్కొంటూ వరుస పోస్టులతో సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి.

రాజకీయ వర్గాలు షాకయ్యేలా..

రాజకీయ వర్గాలు షాకయ్యేలా..

నేను తొలిసారిగా నా పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నా అంటూ సోషల్ మీడియాలో ఒకరోజు ముందే పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి.. ఆ మరుసటి రోజు తాను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పై మనసు పడ్డానని తేల్చేసింది. అతడికి ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. ఆ తరువాత చనిపోయినా పర్లేదు అంటూ వివాదాస్పద కామెంట్ రాసింది. దీంతో ఒక్కసారిగా ఈ టాపిక్ రాజకీయ వర్గాలకు షాకిచ్చింది.

బైరెడ్డి.. నువ్ మాగాడివిరా బుజ్జీ

అంతేకాదు బైరెడ్డిని 'నువ్ మాగాడివిరా బుజ్జీ' అనేసింది శ్రీ రెడ్డి. అతనికి ఒక్కరోజు పెళ్ళాంగా ఉన్నా చాలని, ఆ తరువాత చనిపోయినా ఫర్వాలేదని ఆమె చెప్పడం చూస్తుంటే ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందనే అనుమానం కలుగుతోంది జనాల్లో. చూడాలి మరి ఆ యువనేత శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ పై స్పందిస్తాడా? లేదా? అనేది.

ఎవరీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

ఎవరీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

కర్నూల్ జిల్లా నందికొట్కూరుకు చెందిన వైసీపీ నేతనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన కీలకంగా వ్యవహరించాడు. మంచి వాక్చాతుర్యంతో పాటు యూత్‌లో మాస్ లీడర్‌గా పేరొందారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇప్పుడీ పేరు శ్రీ రెడ్డి వాడటంతో అందరి నోళ్ళలో మరింతగా నానుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X