సమంత మా ఆయనను మాత్రమే పిలిచి కానిచ్చేసింది.. నేను ఫీలయ్యా.. శ్రీ రెడ్డి సంచలనం

Recommended Video

Sri Reddy Satirical Comments On Samantha And Abhiram Daggubati || Filmibeat Telugu

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల స్థాయి క్రేజ్ కొట్టేసింది సంచలన తార శ్రీ రెడ్డి. హీరోయిన్లు సినిమాలతో పాపులారిటీ తెచ్చుకుంటే శ్రీ రెడ్డి మాత్రం రచ్చ చేసి క్రేజ్ కొట్టేసింది. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ పురప్రముఖుల పేర్లు బయటపెట్టిన శ్రీ రెడ్డి.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వారిపై పంచులేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమంతను లాగుతూ శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

ఓ బేబీ సక్సెస్.. టీమ్ సెలబ్రేషన్స్

ఓ బేబీ సక్సెస్.. టీమ్ సెలబ్రేషన్స్

సమంత ప్రధాన పాత్రలో ఇటీవలే విడుదలైన ఓ బేబీ సినిమా సక్సెస్ టాక్ తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఖుషీ అవుతున్న చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వేడుకలో దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హాజరై సందడి చేశాడు. సమంతతో కలిసి కేక్ కట్ చేసి ఓ బేబీ సక్సెస్‌ని ఎంజాయ్ చేశాడు.

శ్రీ రెడ్డి అటాక్.. మా ఆయనతో అంటూ

ఓ బేబీ సక్సెస్‌లో సమంతతో పాటు దగ్గుబాటి అభిరామ్ కనిపించడంతో వెంటనే అటాక్ చేసింది శ్రీ రెడ్డి. తన డైలాగులకు పదును పెడుతూ ఫేస్‌బుక్ వేదికగా పవర్ ఫుల్ పోస్ట్ పెట్టింది. ''ఓ బేబీ ఫంక్షన్‌కి సమంత మా ఆయనను మాత్రమే పిలిచి కేక్ కట్ చేసింది. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చూసి నేను హర్ట్ అయ్యాను సమంత. మా ఆయన కోతి వేషాలు చూడండి'' అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.

దగ్గుబాటి అభిరామ్‌ని మా ఆయన అని ఎందుకు అందంటే..

దగ్గుబాటి అభిరామ్‌ని మా ఆయన అని ఎందుకు అందంటే..

గతంలో కాస్టింగ్ కౌచ్‌పై హంగామా చేసిన సమయంలో టాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల పేర్లు బయటపెట్టింది శ్రీ రెడ్డి. ముఖ్యంగా దగ్గుబాటి రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు తనను ఓ రేంజ్‌లో వాడుకొని వదిలేశాడని, మాయ మాటలు చెప్పి మోసం చేశాడని నానా రచ్చ చేసింది శ్రీ రెడ్డి. అభిరామ్‌తో కలిసి దిగిన కొన్ని పిక్స్ షేర్ చేసి అతనితో అన్నీ కానిచ్చేసానని నిర్మొహమాటంగా చెప్పింది. ఆ కారణంగానే ఇప్పుడు అభిరామ్‌ని, మా ఆయన అని సంబోదించింది కావొచ్చు శ్రీ రెడ్డి.

అస్సలు వదిలేలా లేదుగా

అస్సలు వదిలేలా లేదుగా

కాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన శ్రీ రెడ్డి.. ఆ తర్వాత చెన్నై వెళ్లి అక్కడే సెట్ అయింది. అయినప్పటికీ తాను టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదిలేదే లేదన్నట్లుగా, అవకాశం దొరికినప్పుడల్లా ఆటాడుకుంటోంది శ్రీ రెడ్డి. డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా పవన్ కళ్యాణ్, తేజ, దగ్గుబాటి అభిరామ్ లపై ఓ రేంజ్ పంచులు విసురుతోంది. ఈమె వాలకం చూస్తుంటే వాళ్ళను అస్సలు వదిలేలా లేదు అనిపిస్తోంది.

ఓ బేబీ మూవీ

ఓ బేబీ మూవీ

ఇక ఓ బేబీ సినిమా విషయానికొస్తే.. సమంత, నాగ సూర్య లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రల్లో ఓ బేబీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రంలో నటీనటులంతా అద్భుత నటన కనబర్చడంతో సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ భాగమయ్యింది. ఆ కారణంగానే సక్సెస్ సెలబ్రేషన్స్‌కి విచ్చేశాడు దగ్గుబాటి అభిరామ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X