మరోసారి రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. రకుల్‌ని అంతమాట అనేసిందిగా!
శ్రీ రెడ్డి.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న పేరు. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఆపేయాలంటూ ఉద్యమించిన శ్రీ రెడ్డి మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించింది. హీరో, హీరోయిన్ అనే తేడా లేదు.. సీనియర్, జూనియర్ అనే తేడా లేదు అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలోని ఎంతోమందిని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.

హైదరాబాద్ వదిలి చెన్నై వేదికగా
కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా దేశ వ్యాప్త పాపులారిటీ సంపాదించిన శ్రీ రెడ్డి.. ఆ టైమ్‌లో నానా హంగామా చేసింది. ఆమె చేసిన ఈ ఉద్యమానికి కొందరి సపోర్ట్ లభించినప్పటికీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైంది శ్రీ రెడ్డి. ఆ తర్వాత హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లిన ఆమె సోషల్ మీడియా వేదికగా పలువురు సెలెబ్రిటీలపై ఆరోపణలు గుప్పిస్తోంది.

మరోసారి రకుల్‌ని టార్గెట్ చేస్తూ
గత కొద్దిరోజులుగా శ్రీ రెడ్డి పెడుతున్న పోస్టులు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. తనదైన భావాజాలంతో టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ చుక్కలు చూపిస్తోంది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా రకుల్‌ని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్ పోస్ట్ చేసింది. గతంలోనూ ఎన్‌జీకె సినిమా సమయంలో రకుల్ పై ఇలాగే విరుచుకు పడుతూ కామెంట్స్ పలు పోస్ట్‌లు పెట్టింది శ్రీ రెడ్డి.

అంతమాట అనేసిందిగా!
''రకుల్ పీతి ఐరన్ లెగ్.. పాపం మా బాబాయ్ సినిమా హీరోయిన్ అన్నప్పుడే డిసైడ్ అయ్యా.. ఇది డిసాస్టర్ అని.. అనసూయ ఐతే సూపర్ హిట్ అయ్యేది'' అంటూ ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఆమె చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నువ్వు హీరోయిన్ అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

శ్రీరెడ్డిపై వ్యతిరేకత పెరుగుతోందా..?
శ్రీ రెడ్డి ఎప్పుడైతే టాలీవుడ్ హీరో హీరోయిన్లను టార్గెట్ చేయడం ప్రారంభించిందో అప్పటి నుంచి శ్రీరెడ్డిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆమె పోస్టులను ఎంతో మంది తప్పుబడుతున్నారు. ఇక ఆమె ఇలాంటి పోస్టులు ఎప్పుడు ఆపుతుంది? ఆధారాలు ఎప్పుడు చూపుతుంది అని జనం చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











