పోలీసులు హెచ్చరించినా అదే పని.... అది శ్రీరెడ్డి వీడియోనా? కాదా?
Recommended Video

ప్రమాదాలకు కారణం అవుతున్న 'కికి' ఛాలెంజ్ మీద పోలీసులు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఇలాంటి ఛాలెంజ్ వీడియోలు పోస్టు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హీరోయిన్ రెజీనా ఇటీవల కికి ఛాలెంజ్ వీడియో పోస్టు చేయగా ఆమెను ఈ విషయంలో మందలించారు కూడా. దీంతో వేలం వెర్రిగా మారిన ఈ ఛాలెంజ్ జోలికి పోవడానికి కూడా చాలా మంది భయ పడుతున్నారు. అయితే పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా శ్రీరెడ్డి కికి ఛాలెంజ్ వీడియో పోస్టు చేశారు.
వైరల్‌గా మారిన శ్రీరెడ్డి వీడియో
శ్రీరెడ్డి కికి ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు వద్దని చెప్పినా ఆమె ఇలాంటి వీడియోలు పోస్టు చేయడం, ఇలాంటి వీడియోలు మరింత మంది చేసేలా ప్రొత్సహించేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.

అది శ్రీరెడ్డి వీడియోనా? కాదా?
అయితే ఆ వీడియోలో ఉన్నది శ్రీరెడ్డి కాదని మరికొందరి వాదన. అచ్చం ఆమెలా ఉంది కానీ.... అది శ్రీరెడ్డి కాదు, చూస్తుంటే ఇది విదేశీ అమ్మాయిలా ఉంది. తనలాగే ఉండటంతో శ్రీరెడ్డి దీన్ని పోస్టు చేసిందని భావిస్తున్నారు.
మమల్ని వేశ్యల్లా చూస్తున్నారు
కాగా... శ్రీరెడ్డి కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం తెలుగు ఇండస్ట్రీలో ఈ అంశంపై పోరాడిన ఆమె అటు తమిళనాడు వెళ్లి అక్కడ కూడా తన గళం వినిపించింది. అయితే ఇక్కడ ‘మా', అక్కడ ‘నడిగర్ సంఘం' పట్టించుకోక పోవడం, తగిన చర్యలు తీసుకోక పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమను వేశ్యల్లా చూస్తున్నారని తన తాజా పోస్టులో పేర్కొన్నారు.

చివరి శ్వాస వరకు పోరాడుతా
అన్నింటికీ తెగించే తాను ఈ పోరాటంలోకి దిగాను. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను కాస్టింగ్ కౌచ్ పోరాటం ఆపను, ఇండస్ట్రీలో నాలాగా సమస్యలు ఎదుర్కొన్న ఆడవారినికి న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాను అని శ్రీరెడ్డి స్పష్టం చేశారు.
హీరో ప్రభాస్, ఎన్టీఆర్, దిల్ రాజుకు ఛాలెంజ్!

శ్రీరెడ్డిని ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు?
శ్రీరెడ్డి ఇంత బలంగా పోరాటం చేస్తున్నా.... ఆమెను ఎవరూ పట్టించుకోక పోవడానికి కారణం ఆవిడ చేస్తున్న ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేక పోవడమే. దీంతో ఆమె పలు కేసులు సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది.
సమంతకు తెగనచ్చేసింది... చైతూకు సపోర్టు చేస్తూ ట్వీట్!


Click it and Unblock the Notifications











