మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్‌పై శ్రీ రెడ్డి కామెంట్స్.. ఏకి పారేస్తున్న నెటిజన్లు

Recommended Video

Sri Reddy Posts On Chiranjeevi And YS Jagan || చిరు గారూ మీరు సూపర్

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పేరుతో నానా హంగామా చేసిన శ్రీ రెడ్డి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా బూతు పురాణం, నటీనటుల రాసలీలలు అంటూ రకరకాలుగా కామెంట్లు పెట్టిన ఈ సంచలన తార ఈ సారి మాత్రం సీఎం జగన్‌, మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

యువ ముఖ్యమంత్రితో మెగాస్టార్

యువ ముఖ్యమంత్రితో మెగాస్టార్

ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరి భేటీ జరిగిన వెంటనే శ్రీ రెడ్డి ఫేస్‌బుక్ వేదికగా కామెంట్స్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. జగన్- చిరంజీవి భేటీ అనంతరం ఆమె ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచనలు ఇవ్వడంపై చర్చ సాగుతోంది.

 గతంలో రోజాపై.. ఇప్పుడేమో

గతంలో రోజాపై.. ఇప్పుడేమో

గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి పలు కీలక సూచనలు చేయడం ప్రధానంగా చర్చకు వస్తోంది. పెట్టుబడులపై ఫోకస్ పెట్టాలని, రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరగా పెట్టుబడులు రాబట్టాలని ఆమె చేసిన కామెంట్స్ సబబే అయినప్పటికీ, నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.

పగలు, ప్రతీకారాలు కాదు..

పారిశ్రామిక పురోగతి, వ్యవసాయ రంగ అభివృద్ధి రాష్ట్రానికి వెన్నెముక అని పగలు, ప్రతీకారాలు కావని సీఎం జగన్మోహన్ రెడ్డికి హితబోధ చేసింది శ్రీ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మీరు బాధ్యాయుతమైన తండ్రిలాంటి వారని జగన్మోహన్ రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించింది సంచలన తార.

 జగన్ అంటే జగమ్.. అంబానీ లాంటి వారితో

జగన్ అంటే జగమ్.. అంబానీ లాంటి వారితో

జగన్ ఒంటరి కాదు రాష్ట్రంలో విద్యుత్ కోతల గురించి కూడా శ్రీరెడ్డి ప్రస్తావించింది. అంబానీ లాంటి వ్యక్తుల సహాయం తీసుకోండని జగన్ కి సలహా ఇచ్చింది. మన శత్రువులెవరో తెలుసు కానీ అంటూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శ్రీరెడ్డి హింట్ ఇచ్చింది. జగన్ ఒంటరి కాదని.. జగన్ అంటే జగమ్.. జనం అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించింది.

చిరు సూపర్.. మా సపోర్ట్ మీకే అంటూ

‘చిరు సూపర్ర్.. వైఎస్సార్సీపీ మేమందరం మీకు ఫుల్ సపోర్ట్ అంటూ శ్రీరెడ్డి' అని ఓ పోస్ట్ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను కలిసిన సందర్భంగా శ్రీ రెడ్డి ఈ కామెంట్స్ చేసింది.

జగన్ గారూ స్నేహ పూర్వకంగా ఉండండి

జగన్ గారూ.. మీరు ప్రతీ రాష్ట్రంలోని వీవీఐపీ, ధనవంతులు, రాజకీయ నేతలు.. ముఖ్యంగా ఎన్నారైలతో స్నేహపూర్వకంగా ఉండండి.. వారు మీకు ఎన్నో రకాలుగా సాయం చేయగలరు. మీకంటే పెద్దవారైన కొందరిని గురువుగా స్వీకరించండి. సీనియర్ రాజకీయ నాయకులను నిర్లక్ష్యం చేయవద్దంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేసింది.

జగన్ గారూ.. చాలా ప్రమాదకరం

ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో క్రీడలు, కళలు, సంగీతం, కిక్ బాక్సింగ్, క్రికెట్ లాంటివి ఉండాలని, వాటి కోసం మైదానం ఉండాలని.. ఇవి భవిష్యత్‌లో పౌరులకు ఒత్తిడిని దూరం చేస్తాయని.. ఇందు కోసం సీఎం జగన్ చర్యలు చేపట్టాలని శ్రీ రెడ్డి సూచించింది. ప్రస్తుతం పిల్లలు మొబైల్ గేమ్‌లకే పరిమితమవుతున్నారని.. అది చాలా ప్రమాదకరమని తెలిపింది.

లైంగిక వేధింపుల ఫిర్యాదు బాక్సులు తప్పనిసరి

లైంగిక వేధింపుల ఫిర్యాదు బాక్సులు తప్పనిసరి

లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, ముఖ్యంగా కాలేజీల్లోని వాష్‌రూంలలో ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలని, ఫిర్యాదులను రహస్యంగా ఉంచి, నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని శ్రీరెడ్డి తన పోస్ట్ ద్వారా తెలిపింది.

నెటిజన్లు ఊరుకుంటారా..

నెటిజన్లు ఊరుకుంటారా..

గతంలో ఎన్నో బూతు పోస్టులు పెట్టిన శ్రీ రెడ్డిని ఏకి పారేయడం నెటిజన్లకు అలవాటేగా. కామెంట్ బాక్స్‌లో చెప్పలేని విధంగా కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా శ్రీ రెడ్డి జగన్‌కి సూచనలు ఇవ్వడంపై కూడా మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొందరు సూపర్ అంటుండగా.. ఇంకొందరు విమర్శనాత్మకంగా కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X