పీకే అంటూ శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏపీ పోలీసులకు సలహా.. ఫ్యాన్స్ ఫైర్

సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ కామెంట్ పోస్ట్ చేసింది. దిశా నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సందర్బంగా శ్రీ రెడ్డి స్పందిస్తూ తనదైన స్టైల్‌లో అస్త్రం వదిలింది. ఛాన్స్ దొరికింది కదా అని ఏకంగా ఓ స్టార్ హీరోపై గురిపెట్టింది. ఆ వివరాలు చూద్దామా..

దిశా కేసుకు నేటితో పరిష్కారం.. ఎన్‌కౌంటర్

దిశా కేసుకు నేటితో పరిష్కారం.. ఎన్‌కౌంటర్

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దిశా కేసుకు నేటితో ఓ పరిష్కారం లభించింది. దేశ ప్రజలంతా కోరుకున్న విధంగా దిశా కేసులో నిందితులైన ఆ నలుగురు యువకులు చంపబడ్డారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేశారు.

 దేశవ్యాప్తంగా ప్రజల హర్షం.. సెలబ్రిటీలు సైతం

దేశవ్యాప్తంగా ప్రజల హర్షం.. సెలబ్రిటీలు సైతం

దీంతో యావత్ దేశవ్యాప్తంగా ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు చేసిన ఈ ఎన్‌కౌంటర్‌పై సరైన శిక్ష అని పేర్కొంటున్నారు. ఈ మేరకు పలువురు సెలబ్రిటీలు సైతం తెలంగాణ పోలీసుల చేసిన ఎన్‌కౌంటర్‌‌ని సమర్థిస్తూ నిందితులకు సరైన శిక్ష పడిందని ట్వీట్స్ చేస్తున్నారు.

Recommended Video

#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
ఎంటరైన శ్రీ రెడ్డి.. తెలంగాణ పోలీసులు అంటూ

ఎంటరైన శ్రీ రెడ్డి.. తెలంగాణ పోలీసులు అంటూ

ఈ పరిస్థితుల్లో ఇదే అంశంపై శ్రీ రెడ్డి కూడా స్పందిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టింది. ముందుగా.. ఆ నలుగురు రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేసిన తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ అని తెలిపింది. ఈ ఎన్‌కౌంటర్‌ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ జై కెసీఆర్ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.

ఏపీ పోలీసులకు శ్రీ రెడ్డి విన్నపం

ఇక అంతటితో ఆగక ఆ వెంటనే మరో పోస్ట్ ద్వారా పలు చర్చలకు తెరలేపింది. ఎవరైతే పీకే లాగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారో వాళ్ళను కూడా ఎన్‌కౌంటర్‌ చేసేయాలి. ఏపీ పోలీసులకు ఇదే నా విన్నపం అంటూ సంచలన కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.

అదును చూసి టార్గెట్ చేసిందా?

కాస్టింగ్‌కౌచ్ పై పోరాటం చేస్తున్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతూ వస్తోంది శ్రీ రెడ్డి. ఈ మేరకు అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలా అదును చూసి పీకే అంటూ ఆయన్నే శ్రీ రెడ్డి టార్గెట్ చేసిందని తెలుస్తోంది.

శ్రీ రెడ్డిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్

శ్రీ రెడ్డిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్

శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ''పీకే పెళ్లిళ్లు చేసుకున్నాడు కానీ నీలాగా అది చేయడం లేదు కదా, నీ మెదడు నుంచీ ఇంత కన్నా గొప్ప స్పందన ఊహించలేములే తల్లీ.. నీకో దండం'' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X