twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోన్ కాల్ లీక్‌పై శ్రీరెడ్డి వివరణ: అందుకే అలా మాట్లాడా, పవన్ ఫ్యాన్స్ అర్థం చేసుకోండి!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Sri Reddy Reacts About Phone Call Leak

    కాస్టింగ్ కౌచ్ అంశంపై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం పక్కదారి పట్టింది. ఎవరూ ఊహించని విధంగా అసలు అంశం సైడ్ ట్రాక్ అయిపోయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకు ఫోకస్ మళ్లింది. శ్రీరెడ్డి తన నోటి దురుసుతో పవన్ కళ్యాణ్‌ను బూతులు తిట్టిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.

    ఇది చాలదన్నట్లు తన స్నేహితురాలు, ట్రాన్స్ జెండర్ తమన్నాతో శ్రీరెడ్డి మాట్లాడిన ఫోన్ టేపు లీక్ కావడంతో పరిస్థితిని మరింత జఠిలం అయింది. ఈ ఫోన్ కన్వర్జేషన్లో నేను చచ్చే వరకు పవన్ కళ్యాణ్ ఓటమి కోసం కృషి చేస్తానని శ్రీరెడ్డి చెప్పడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. నిన్నటి వరకు శ్రీరెడ్డి మీద పాజిటివ్ ఓపీనీయన్ ఉన్న వారిలో కూడా ఈ ఫోన్ టేపు లీక్‌తో ఆమెపై నెగెటివ్ ఇంప్రెషన్ పడేలా చేసింది.

    శ్రీరెడ్డి వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయనే అనుమానం

    శ్రీరెడ్డి వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయనే అనుమానం

    ఈ లీకు వ్యవహారంతో శ్రీరెడ్డి వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను తొక్కేయడానికి శ్రీరెడ్డిని ఇతర పార్టీలు ఉపయోగించుకుంటున్నాయనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది.

    ఈ పరిణామాలతో షాకైన శ్రీరెడ్డి

    ఈ పరిణామాలతో షాకైన శ్రీరెడ్డి

    తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో శ్రీరెడ్డి షాయ్యారు. తాను ఈ పోరాటం మొదలు పెట్టడానికి గల కారణం ఏమిటి? తాను చేయాలనుకున్నది ఏమిటి? ప్రస్తుతం తాను చేస్తున్నది ఏమిటి? అనే విషయంలో రియలైజ్ అయిన శ్రీరెడ్డి....... ఫోన్ టేపు లీక్ అనంతరం ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

    తన వెనక తనకు తెలియకుండానే రాజకీయాలు

    తన వెనక తనకు తెలియకుండానే రాజకీయాలు

    తాను కాస్టింగ్ కౌచ్ సమస్యపై పోరాటం చేస్తున్నానని, కానీ తన వెనక తనకు తెలియకుండానే ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయని, వాటి ప్రభావానికి తాను గురయ్యానని, ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ విషయంలో అలా ప్రవర్తించాల్సి వచ్చిందని........ దీని వెనక రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుండటంతో ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అని శ్రీరెడ్డి తన సోషల్ మీడియా పేజీ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

     ఆ ఫోన్ కాల్ ప్రస్టేషన్లో మాట్లాడిందే...

    ఆ ఫోన్ కాల్ ప్రస్టేషన్లో మాట్లాడిందే...

    పవన్ కళ్యాణ్ గురించి తమన్నాతో తాను మాట్లాడిన ఫోన్ కాల్.... అంతకు ముందు జరిగిన పరిణామాలతో ప్రస్టేషన్లో మాట్లాడిందే అని, కొందరు చెప్పిన కొన్ని మాటలు విని డిస్ట్రబ్ అయి అలా మాట్లాడాను. తర్వాత నేను అలా మాట్లాడాల్సింది కాదని, కాస్టింగ్ కౌచ్ పోరాటంలోకి వేరే ఏవో ఇష్యూలు అనవసరంగా వస్తున్నాయి అని రియలైజ్ అయ్యాను.... అని శ్రీరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు.

     రాజకీయ అండ అవసరం లేదు

    రాజకీయ అండ అవసరం లేదు

    కాస్టింగ్ కౌచ్ పోరాటంలో రాజకీయ పార్టీల అండ మాకు అవసరం లేదు. నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇకపై మెయిన్ ఇష్యూ మీదనే ఫోకస్ పెడతాను. దయచేసి ఎవరూ ఈ పోరాటాన్ని తప్పు దారిలోకి మళ్లించడానికి ప్రయత్నించవద్దు.... అని శ్రీరెడ్డి కోరారు.

    పీకే ఫ్యాన్స్ అర్థం చేసుకోండి

    పీకే ఫ్యాన్స్ అర్థం చేసుకోండి

    నా స్నేహితులు, పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నాకు రాజకీయాలు తెలియవు, అందుకే వారి ఊచ్చులో పడి ఇలాంటి స్థితికి వచ్చాను. ఎవరు ఇదంతా చేస్తున్నారో తెలియదు..... అని శ్రీరెడ్డి వాపోయారు.

     పవన్ కళ్యాణ్ న్యూస్ ఆపుదాం

    పవన్ కళ్యాణ్ న్యూస్ ఆపుదాం

    ఇకపై సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ‘కాస్టింగ్ కౌచ్' అంశం మీదనే ఫోకస్ పెడదాం. పవన్ కళ్యాణ్ న్యూస్ ఆపుదాం, అంతా కలిసి మెయిన్ కాజ్ కోసం పోరాడదాం. చదువుకున్నవారంతా దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.... అని శ్రీరెడ్డి తెలిపారు.

    వివరణ ఇస్తూ శ్రీరెడ్డి పోస్ట్

    వివరణ ఇస్తూ శ్రీరెడ్డి పోస్ట్

    ఫోన్ కాల్ టేపు లీక్ అనంతరం.... ప్రజలకు, పవన్ అభిమానులకు వివరణ ఇస్తూ శ్రీరెడ్డి చేసిన పోస్టు.

    English summary
    Sri Reddy Reacts About Phone Call Leak. A leaked audio clip of a recent phone conversation between Sri Reddy and transgender-actress Tamanna has revealed some startling revelations which are no less than crime thriller. The conversation took place after Sri Reddy faced an all-round attack for calling Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X