టాలీవుడ్‌లో రేవ్ పార్టీలు.. భద్రత కల్పిస్తే ప్రముఖుల పేర్లు బయటపెడుతా.. వైరల్‌గా శ్రీరెడ్డి వీడియో

టాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ విషయాలు బయటపెట్టడానికి సిద్దంగా ఉన్నానని వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలో అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్ కేసు గురించి ఆమె ప్రస్తావించడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలో ఏం చెప్పారంటే..

టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా

టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు నా విన్నపం. టాలీవుడ్‌లో ఉన్న మాఫియా, అకృత్యాలు, అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ఎలా మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకొంటున్నాను. గతంలో ఇలాంటి విషయాలను చెప్పడానికి అర్ధనగ్నంగా నిరసన తెలిపాను. మూవీ ఇండస్ట్రీ కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లో మాత్రమే బంధించబడింది అంటూ శ్రీరెడ్డి అన్నారు.

విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకొంటూ

విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకొంటూ

కొందరు మూవీ మాఫియాగా మారి చిన్న చిన్న హీరోలను తొక్కేస్తూ, వేషాల ఎరవేసి అమ్మాయిలతో కోరికలు తీర్చుకొంటున్నారనే విషయాన్ని గతంలో చెప్పాను. అప్పట్లో డ్రగ్స్ గురించి కూడా నేను చెప్పాను. నాకు తెలిసిన చాలా మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకొంటున్నారనే విషయం నాకు తెలుసు అని శ్రీరెడ్డి తెలిపారు.

టాలీవుడ్‌లో జోరుగా రేవ్ పార్టీలు

టాలీవుడ్‌లో జోరుగా రేవ్ పార్టీలు

టాలీవుడ్‌లో రేవ్ పార్టీలు, డ్రగ్స్ వాడే వారి పేర్లు బయటపెడితే రచ్చ రచ్చ అవుతుంది. కాబట్టి నాకు సెక్యూరిటీ ఇస్తే టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వారి పేర్లు చెబుతా. పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేసుకొంటూ డ్రగ్స్ పార్టీలు చేసుకొంటున్నారు. ఆ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకొంటున్నారు అని శ్రీరెడ్డి అన్నారు.

దందాలు, అకృత్యాలు, వ్యభిచారాలు

దందాలు, అకృత్యాలు, వ్యభిచారాలు

టాలీవుడ్‌లో లేని దందాలు, జరగని అకృత్యాలు లేవు. రకరకాల వ్యభిచారాల గురించి చెప్పడానికి నోరు రావడం లేదు. కొందరి అకృత్యాల వల్ల చాలా మంది జీవితాలు రోడ్డుపైకి వచ్చాయి. చాలా మంది నిర్మాతల సినిమాలు ల్యాబ్‌లో మురిగిపోతున్నాయి. చిన్న నిర్మాతలు తమ కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితి నెలకొని ఉంది అని శ్రీరెడ్డి తెలిపారు.

Recommended Video

#Watch : Hero Vishal Explains How He Was Cured From Corona
బీజేపీ ప్రభుత్వం భేష్.. శ్రీరెడ్డి

బీజేపీ ప్రభుత్వం భేష్.. శ్రీరెడ్డి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, బాలీవుడ్ రాకెట్ విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగున్నది. దేశ సినీ పరిశ్రమ ప్రతిష్టకు మచ్చ రాకుండా కేంద్రం చేపట్టిన దర్యాప్తుపై ప్రశంసలు వర్షం కురుస్తున్నది. అలాగే కన్నడ పరిశ్రమలో కూడా డ్రగ్‌ రాకెట్ ఉక్కుపాదం మోపడంతో అనేక విషయాలు బయటపడుతున్నాయి. అలాగే టాలీవుడ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీరెడ్డి అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X