రకుల్ ప్రీత్‌‌ను అరెస్ట్ చేస్తే.. డ్రగ్ దందా బట్టబయలు, వాళ్ల కూతుళ్లు కూడా: శ్రీరెడ్డి సంచలన వ్యాఖలు

బాలీవుడ్ డ్రగ్ రాకెట్‌లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రాగానే వివాదాస్పద నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయంటూ రకుల్, ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలను శ్రీరెడ్డి టార్గెట్ చేసింది. ఓ వీడియోను రిలీజ్ చేసి తనకు రక్షణ కల్పిస్తే టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే ప్రముఖుల పేర్లు బయటపెడుతాను అంటూ ఆమె తెలిపింది. గతంలో రకుల్ ప్రీత్‌తో ఉన్న వైరాన్ని ఈ సందర్భంగా బయటపెట్టింది. గతంలో మీటూ ఉద్యమం సమయంలో ఆరోపణలు చేస్తే తనను టార్గెట్ చేస్తూ రకుల్, ఇతర ప్రముఖులు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రకుల్‌పై శ్రీరెడ్డి తీవ్రంగా స్పందిస్తూ..

టాలీవుడ్‌లో చీకటి కోణాలు

టాలీవుడ్‌లో చీకటి కోణాలు

టాలీవుడ్‌లో పెద్దల ముసుగులో చాలా మంది అరాచకాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో మాఫియాగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న చీకటి కోణం నాకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం నాకు సహకారం అందిస్తే నేను వాటిని బయటపెడుతాను. ఎన్సీబీ అధికారులు టాలీవుడ్‌పై కూడా దృష్టి పెట్టాలి. ఎంత పెద్దవాళ్లైనా బయటకు రావాలి అని శ్రీరెడ్డి తెలిపారు.

రకుల్ ప్రీత్‌ను విచారిస్తే అంతా బయటకు

రకుల్ ప్రీత్‌ను విచారిస్తే అంతా బయటకు

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ గట్టిగా విచారిస్తే.. టాలీవుడ్‌లో డ్రగ్స్ లింకులు ఉన్న టాప్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులందరి పేర్లు బయటకు వస్తాయి. ఎవరైతే తెలుగు ఇండస్ట్రీలో పార్టీలు నిర్వహించే పేర్లు బయటకు రావాల్సిన అవసరం ఉంది. నాలాంటి అమ్మాయిలను వాడుకొన్నారు. చాలా మంది అలాంటి బడా సెలబ్రిటీల కాళ్ల కింద నలిగిపోయాం. దయచేసి అలాంటి పెద్ద వాళ్ల చీకటి కోణాన్ని బయటపెట్టాలి అని శ్రీరెడ్డి కోరారు.

గతంలో డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు

గతంలో డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు

గతంలో డ్రగ్స్ దందా బయటకు వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో సంచలనం రేగింది. ఆ కేసులో పెద్ద తారలు, దర్శకులు, నిర్మాతల పేర్లు బయటకు వచ్చాయి. అయితే అనూహ్యంగా దర్యాప్తు ఆగిపోయింది. కేసు దర్యాప్తు సీరియస్‌గా సాగుతున్న సమయంలో అధికారులు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. నాకు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. డ్రగ్స్ భూతం తెలంగాణలో ఉండకూడదు. తెలంగాణ యువతకు అంటుకోకూడదు అని శ్రీరెడ్డి అన్నారు.

నాపై టాలీవుడ్ కక్ష కట్టింది..

నాపై టాలీవుడ్ కక్ష కట్టింది..

టాలీవుడ్‌లో జరుగుతున్న అకృత్యాలపై నేను నోరు విప్పిప్పితే ఇప్పటికి నాకు ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్ రాలేదు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో సభ్యత్వం ఇవ్వలేదు. ఇండస్ట్రీకి నాకు ఉన్న వివాదం డ్రగ్స్, నార్కోటిక్స్‌తో సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ జరిగే అకృత్యాలను మీ దృష్టికి తీసుకురావాలని ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నాను అని శ్రీరెడ్డి వీడియోలో తెలిపారు.

Recommended Video

#Watch : Hero Vishal Explains How He Was Cured From Corona
 డ్రగ్స్ విషయంలో రకుల్ ప్రీత్, ఇతర సెలబ్రిటీలను

డ్రగ్స్ విషయంలో రకుల్ ప్రీత్, ఇతర సెలబ్రిటీలను

డ్రగ్స్ మాఫియా విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, సెలబ్రిటీల కూతుళ్లు, ఇతర సెలబ్రిటీలు, ఎవరైతే హీరోలు డ్రగ్స్ వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకొనే వారున్నారు. యూత్‌, అమ్మాయిలను పార్టీలకు పిలిచి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఇలాంటి అడ్డుకోవాలంటే నార్కోటిక్స్ ఉక్కుపాదం మోసాలని కోరుతున్నాను. టాలీవుడ్‌లో డ్రగ్స్ సంబంధాలు ఉన్న వారిని అరెస్ట్ చేయాలని కోరుతున్నాను అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X