»   » పవన్ కళ్యాణ్ అన్నా మీరు మాట్లాడాలి.. వాళ్ళ ఇళ్లల్లో పుట్టలేదు, కన్నీరు పెట్టుకున్న శ్రీరెడ్డి!

పవన్ కళ్యాణ్ అన్నా మీరు మాట్లాడాలి.. వాళ్ళ ఇళ్లల్లో పుట్టలేదు, కన్నీరు పెట్టుకున్న శ్రీరెడ్డి!

Subscribe to Filmibeat Telugu
Sri Reddy Request PawanKalyan To Respond

నటి శ్రీరెడ్డి పోరాటం కొత్త మలుపులు తిరుగుతోంది. శ్రీరెడ్డికి మహిళా సంఘాల నుంచి మద్దత్తు లభిస్తోంది. తాజాగా ఓయూ విద్యార్థులు కూడా శ్రీరెడ్డికి మద్దత్తు తెలపడం విశేషం. టాలీవుడ్ లో కొందరు అమ్మాయిలని రాబందుల్లా పీక్కుతింటున్నారని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరెడ్డి కొద్దీ సేపటి క్రితం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అక్కడ విద్యార్థుల మద్దత్తు కూడగట్టింది. గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి టాలీవుడ్ లో, మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసన జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ అయింది.

గత కొన్ని రోజులుగా

గత కొన్ని రోజులుగా

నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా మీడియాలో రోజూ కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖుల వలన తాను కాస్టింగ్ కౌచ్ కు బలయ్యానని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తనలాగే చాలా మంది నటించాలనే కోరిక ఉన్న యువతులు కాస్టింగ్ కౌచ్ వలన నరకం అనుభవిస్తున్నారని తెలిపింది.

 అర్థ నగ్న నిరసనతో

అర్థ నగ్న నిరసనతో

శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు చేసిన అర్ధనగ్న నిరసనతో ఆమె పోరాటం మరింతగా హీటెక్కింది. ప్రస్తుతం తెలుగు మీడియా ఫోకస్ మొత్తం శ్రీరెడ్డి వైపే ఉందని అనడంలో సందేహం లేదు.

 ప్రముఖుల పేర్లు బయటకు

ప్రముఖుల పేర్లు బయటకు

తనని వాడుకుని వదిలేసిన వారి గురించి శ్రీరెడ్డి లీకులు ఇచ్చింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ వలన తాను మోసపోయానని, అతడితో సన్నిహితంగా ఉన్నా ఫోటోలని శ్రీరెడ్డి మీడియాకు విడుదుల చేసిన సంగతి తెలిసిందే.

 జాతీయవ్యాప్తంగా పోరాటం

జాతీయవ్యాప్తంగా పోరాటం

తన డిమాండ్లకు స్పందించకుంటే ఈ పోరాటాన్ని జాతీయ స్థాయికైనా తీసుకుని వెళతానని శ్రీరెడ్డి హెచ్చరించింది. తాజగా శ్రీరెడ్డి ఓయూ విద్యార్థుల మద్దత్తు కూడగట్టేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళింది.

 ఆడపిల్ల ఏడిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు

ఆడపిల్ల ఏడిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు

ఆడపిల్ల కన్నీరు కారిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని ఓయూ విద్యార్థులు నిరూపించారని శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడింది. ఒక చెల్లిగా తనని ఆదరించడానికి వారు ముందుకు వచ్చారని శ్రీరెడ్డి తెలిపింది.

వాళ్ళ ఇళ్లలో పుట్టలేదు

వాళ్ళ ఇళ్లలో పుట్టలేదు

తాను వారి ఇళ్లలో పుట్టలేదని అయినా సొంత అన్నలాగే తనకుసాయం అందించేందుకు ముందుకు వచ్చారని శ్రీరెడ్డి ఉద్వేగ భరితంగా మాట్లాడింది. ఈ సందర్భగా శ్రీరెడ్డి ఓయూ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపింది.

చాలా మంది ఉన్నారు

చాలా మంది ఉన్నారు

తనలాగా మోసగింపబడిన యువతులు చాలా మంది యువతులు ఇండస్ట్రీలో ఉన్నారని శ్రీరెడ్డి తెలిపింది. తెలుగు అమ్మాయిలకు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. దీనిపైనే తన పోరాటం అని తెలిపింది.

ప్రెస్ మీట్ పెట్టారు కానీ

ప్రెస్ మీట్ పెట్టారు కానీ

తాను బట్టలు విప్పేసాను అంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఎవరికోసం తాను బట్టలు విప్పాను అని శ్రీరెడ్డి మీడియా ముఖంగా ప్రశ్నించింది. మా అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ పెట్టారు కానీ తనకు మద్దతుగా ఒక్కరు కూడా రాలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.

 భిక్షగాడు వచ్చినా కూడా

భిక్షగాడు వచ్చినా కూడా

మన ఇంటి ముందుకు భిక్షగాడు వచ్చినా కూడా బిక్షం వస్తాం. అలాంటిది తాను తెలుగు అమ్మాయిని అని, చేతగాని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.

పవన్ కళ్యాణ్ అన్నా ఒక్కసారి మాట్లాడు

పవన్ కళ్యాణ్ అన్నా ఒక్కసారి మాట్లాడు

ఈ సందర్భంగా శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా మీడియా ముఖంగా కోరింది. పవన్ అన్నా మీరు స్పందించాలి అని అప్పీల్ చేసింది. ఇంటగెలిచి రచ్చ గెలవాలి అని పవన్ ని కోరింది. ప్రజా సమస్యల గురించి మీరు వేదికలపై మాట్లాడతారు. ప్రపంచమంతా చర్చించుకుంటున్నా ఈ విషయం గురించి మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నా.. ఇది ఆడపిల్ల వ్యవహారం అన్నా.. ఒకేసారి మాట్లాడండి అన్నా అంటూ శ్రీరెడ్డి పవన్ ని కోరింది.

 అన్ని రంగాల్లో మహిళలు

అన్ని రంగాల్లో మహిళలు

ప్రస్తుతం మహిళలు అని రంగంల్లో ఎదుగుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు ఎందుకు ఎదగలేకపోతున్నారని శ్రీరెడ్డి ప్రశ్నించింది. మనకు ప్రతిభ ఉందని గుర్తు చేసింది. కోట్లిచ్చి ఉత్తరాది వారిని ఎందుకు తెచ్చుకోవడం అని ప్రశ్నించింది.

English summary
Sri Reddy request PawanKalyan to respond. She became emotional after meets OU students
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X