వణుకు తెప్పిస్తా, నీ భార్యకు చెప్పావా?... నాని లీగల్ నోటీసులపై శ్రీరెడ్డి

By Bojja Kumar

తెలుగు హీరో నాని తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సెక్సువల్‌గా వాడుకున్నాడని కొన్ని రోజులుగా శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తుండటం మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అప్పటికీ తాను రియాక్ట్ అవ్వకపోతే జనాల్లోకి మరో రకంగా సంకేతాలు వెళతాయని భావించినా నాని... సోమవారం సాయంత్రం ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. నాని పంపిన లీగల్ నోటీసులపై శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో తాను ఎలా ముందుకు సాగుతాను అనేది వెల్లడించారు.

Recommended Video

Sri Reddy Tweets About Nani Again
ఎయిర్ పోర్ట్ నుండే సందేశం..

ఎయిర్ పోర్ట్ నుండే సందేశం..

తన పుట్టినరోజు(జూన్ 12)ను పురస్కరించుకుని శ్రీరెడ్డి కేరళలో గడిపేందుకు వెళ్లారు. సోమవారం సాయంత్రం ఆమె ఎయిర్‌పోర్టులో ఉండగా నాని లీగల్ నోటీసుల విషయం తెలిసిందే. దీంతో ఆమె ఎయిర్ పోర్ట్ నుండే ఎఫ్‌బి లైవ్ ద్వారా తన స్పందన తెలిపారు.

 లీగల్ నోటీసులు పంపడం సంతోషంగా ఉంది

లీగల్ నోటీసులు పంపడం సంతోషంగా ఉంది

నాని నాకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిసింది. నాకు కావాల్సింది కూడా ఇదే. చాలా సంతోషంగా ఉంది అన్నారు. ‘నేను ఇంకొంచెం నీ మీద యాక్టివ్ గా ఫైట్ చేయడానికి, అదే సమయంలో నా వైపు నుండి దీన్ని తిప్పి కొట్టాలి, నీ రంకు బాగోతాన్నంతా బయటకు తీసుకురావడానికి నాకు ఇది ఒక మంచి అవకాశం' అని శ్రీరెడ్డి తెలిపారు.

 ఏడుస్తూ కూర్చోవద్దని చాటి చెబుతాను

ఏడుస్తూ కూర్చోవద్దని చాటి చెబుతాను

ఇప్పటి వరకు అమ్మాయిలు బాధితులు అయితే ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే అమ్మాయిలకు న్యాయం జరుగదు. వారందరూ ఇన్ స్పైర్ అయ్యేలా చేస్తాను. బాధిత మహిళలు ఎలా ఫైట్ చేయాలో చేసి చూపిస్తాను.... అని శ్రీరెడ్డి తెలిపారు.

నీ భర్యాకు చెప్పావా?

నీ భర్యాకు చెప్పావా?

నువ్వు తప్పు చేసింది నీ మనసాక్షికి తెలుసు. నువ్వు నీ వైఫ్‌కు అన్నీ చెబుతావని అంటారు. మన సంగతి చెప్పావో లేదో తెలియదు.... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.

అందరికీ వణుకు తెప్పించేలా నీ మీద ఫైట్ చేస్తాను

అందరికీ వణుకు తెప్పించేలా నీ మీద ఫైట్ చేస్తాను

ఈ పోరాటంలో నేను ఎంత పీక్ స్టేజీకి వెళతానంటే... అందరికీ వణుకు తెప్పించేలా నీ మీద ఫైట్ చేసి చూపిస్తాను. అది ఎలా చేస్తాను? ఏం చేస్తాను అనేది గురువారం తిరిగి హైదరాబాద్ వచ్చాక చెబుతాను అని శ్రీరెడ్డి తెలిపారు.

ఇది నా ఛాలెంజ్....

ఇది నా ఛాలెంజ్....

నువ్వేదో జనాల్లో పరువు పోతుందని లీగల్ నోటీసులు పంపావు కానీ, ఏం జరిగిందో నీకు తెలుసు. తప్పకుండా నేను ఫైట్ చేస్తాను. ధర్మానికి బలం ఉంటే, శక్తివంతం అయితే నువ్వు కచ్చితంగా దొరుకుతావు. దేవుడు కచ్చితంగా నీకు శిక్ష వేస్తాడు. ఇది నా ఛాలెంజ్.... అని శ్రీరెడ్డి అన్నారు.

శ్రీరెడ్డి ఇష్యూపై పరోక్షంగా స్పందించిన నాని భార్య

శ్రీరెడ్డి ఇష్యూపై పరోక్షంగా స్పందించిన నాని భార్య

‘‘సినీ పరిశ్రమ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిసిటీ కోసం ఇతరుల జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌టం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవ‌రూ నమ్మరు. కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి ఎలా సిద్దప‌డ‌తారో'' అని నాని భార్య అంజ‌నా ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X