వర్మకు నేను వ్యతిరేకం, అందుకే నాతో పవన్ మీద ఆ మాట అనిపించాడు: శ్రీరెడ్డి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి శ్రీరెడ్డి ఓ బూతు పదం ఉచ్చరించడంతో ఇండస్ట్రీలో పెద్ద రచ్చ కావడం, శ్రీరెడ్డితో ఆ మాట అనిపించింది తానే అని వర్మ ఒప్పుకోవడంతో ఆ తర్వాత పరిణామాలు కొత్త మలుపు తిరగడం తెలిసిందే. తన తల్లిని తిట్టిన, తిట్టించిన ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం దాల్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో దెబ్బకు ఇండస్ట్రీ మొత్తం దిగొచ్చింది. కాస్టింగ్ కౌచ్, ఇతర సమస్యలపై ఇండస్ట్రీ పెద్దలు సమావేశం అయి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు.
తాజాగా మీడియా ప్రెస్ మీట్లో రామ్ గోపాల్ వర్మ ప్రస్తావన రాగా... శ్రీరెడ్డి తనదైన రీతిలో స్పందించారు. రామ్ గోపాల్ వర్మకు నేను పచ్చి వ్యతిరేకం. ఆయన సురేష్ బాబు తరుపు అని నాకు ఆల్రెడీ తెలుసు. ఆ రోజు డైరెక్టు కాల్ చేయడమే 5 కోట్ల ఆఫర్లతో నా ముందుకొచ్చారు. తేజ గారి ద్వారా కూడా సురేష్ బాబు సెటిల్మెంట్లకు ట్రై చేశారు అని శ్రీరెడ్డి తెలిపారు.

వర్మ ఇలా పవన్ కళ్యాణ్ గురించి అనమని చెప్పినపుడు.... నేను ఒకటే ఆలోచించాను. ఆ మాట అంటే ఇండస్ట్రీ కదులుతుంది అనే ఉద్దేశ్యం మీద ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద ఆ మాట అనేశాను అని శ్రీరెడ్డి తెలిపారు.
అయితే తనతో ఈ మాట అనిపించడం వెనక రామ్ గోపాల్ వర్మ ఉద్దేశ్యం వేరని, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టచ్ చేస్తే ఈ ఉద్యమం, పోరాటం అంతా చతికిల పడిపోతుంది. ప్రతి ఒక్కరూ బయటకు వస్తారు, దీన్ని స్మాష్ చేస్తారు అనే ఉద్దేశ్యంతో రామ్ గోపాల్ వర్మ చెప్పమన్నాడు అనేది నా ఉద్దేశ్యమని శ్రీరెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications











